ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

by Kalyani |   ( Updated:2023-07-01 13:40:21.0  )
ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఎప్పుడు వేడి అన్నం తినడానికే ఇష్ట పడతారు. అందుకనే ఒకసారి వండిన అన్నాన్ని ఒక పూట తిని, మరోపూటకు అదే అన్నాన్ని వేడి చేసి తింటూ ఉంటారు. అలా తినడం మూలంగా ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వండిన తరువాత చల్లబడిన అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకంటే వేరే ఆహార పదార్థాల వలె కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది.

ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి వేడి చేసి తినడంతో ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో మాత్రమే ఉంచాలి. అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది అసలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more: దేవుడి ఫొటోలు ఏ దిక్కున ఉండాలో తెలుసా

Advertisement

Next Story

Most Viewed

    null