Snake: ఆకులు సేకరించి గూడు కట్టుకునే ఏకైక పాము గురించి తెలుసా.. ఇది కాటేస్తే ఇక అదే చివరి రోజు..!

by Prasanna |
Snake: ఆకులు సేకరించి గూడు కట్టుకునే ఏకైక పాము గురించి తెలుసా.. ఇది కాటేస్తే ఇక అదే చివరి రోజు..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పాములున్నాయి. కొందరు వీటిని చూడగానే భయపడి పారిపోతుంటారు. పాముల్లో కొన్ని గాల్లోకి కూడా ఎగురుతాయి. ఈ అరుదైన వీడియోలు ఇప్పుడు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మనం ఇప్పటి వరకు పక్షులు మాత్రమే గూడు కట్టుకుంటాయని విన్నాము. అయితే, పాముల్లో ఒక రకం జాతి గూడు కట్టుకుంటాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఆ పాము ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కింగ్ కోబ్రా ( king cobra ) ఈ వరల్డ్ లోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దీనికి ఉన్న తెలివి ఏ పాములకి ఉండదు. ఇది వేటాడడంలో కొత్త పద్ధతులను పాటిస్తాయి. ఇతర పాములలో లేని ఎన్నో గుణాలు దీనిలో ఉంటాయి. అలాగే, వేటాడేటప్పుడు ఫుల్ ఎనర్జీ గా ఉంటుంది. మగ కింగ్ కోబ్రాలు నివసించే ప్రదేశంలో ఇతర పాములను అస్సలు రానివ్వవు.

ఆడ కింగ్ కోబ్రాలు చాలా తెలివిని ప్రదర్శిస్తాయి. ఇవి గుడ్లు పెట్టడానికి ప్రత్యేక గూడులను కట్టుకుంటాయి. అంతే కాకుండా, ఇవి ఆకులు, కొమ్మలను సేకరించి మరి గూడు నిర్మిస్తాయి. ఈ వరల్డ్ లో గూడు కట్టే ఏకైక పాము ఇదే అని నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed