జీవితంలో సర్వం కోల్పోయామనే ఫీలింగ్ వెంటాడుతుందా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-27 07:15:50.0  )
జీవితంలో సర్వం కోల్పోయామనే ఫీలింగ్ వెంటాడుతుందా?
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సర్వం కోల్పోయామని బాధపడుతున్నారా? జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తారు. అసలు లైఫ్ లో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు.. ఆ తర్వాత ఏం చేయాలో తోచనప్పుడు ఈ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు మీరు చేసిన తప్పును అంగీకరించాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడే జీవితంలో కొత్త దశ ప్రారంభించగలరని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో.. దానికి పూర్తి బాధ్యత వహించాలని అంటున్నారు.

ఇలా మొత్తం కోల్పోయామనే బాధకు గల కారణం... మీ మనసుకు తెలుసు. కానీ మీరు యాక్సెప్ట్ చేయలేరు. జాబ్, లవ్ లైఫ్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇందుకు కారణం అయుండొచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటప్పుడు జర్నలింగ్ స్టార్ట్ చేయమని సూచిస్తున్నారు. ఆరోజు ఏం జరిగింది? మూడు గొప్ప అనుభవాలు ఏంటి? వాటి గురించి గ్రేట్ గా

ఫీల్ అవండి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మిమ్మల్ని మీరు సరెండ్ చేసుకునే ఫస్ట్ స్టెప్ అంటున్నారు.

మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ప్రారంభించండి. మనుషులు తప్పు చేయడం సహజం. వాటిని ఓన్ చేసుకుని.. మళ్లీ రియాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించండి. మూవ్ ఆన్ అవండి అంటున్నారు నిపుణులు. మీ పాషన్ గుర్తించి.. మీ హాబీలో మునిగిపోమని సూచిస్తున్నారు. మీరు ఎందులో అయితే ప్రావిణ్యం పొందారో.. అది మీకు నమ్మకం, ధైర్యం ఇవ్వగలదు.

కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. మీ మైండ్, బాడీ రీబిల్ట్ చేసేందుకు ప్రయత్నించండని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed