- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hypo Tension : భోజనం తర్వాత కళ్లు తిరుగుతున్నాయా?.. స్ట్రోక్‌కు దారితీయొచ్చు!!?
దిశ, ఫీచర్స్: భోజనం తర్వాత కళ్లు తిరుగుతున్నాయా? ఎక్కువ సేపు కూర్చున్నాక నిలబడితే తల తిరుగుతున్నట్లు అనిపించిందా? పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఆహారం తీసుకున్నాక రక్తపోటు తగ్గడం ఈ పరిస్థితికి కారణం కాగా.. వృద్ధుల్లో ఇది సాధారణమని, సడెన్ హెడేక్‌తో కొన్నిసార్లు పడిపోతుంటారని వివరించారు. జీర్ణక్రియకు సహాయపడటానికి మెదడు, శరీరం నుంచి రక్తం గట్‌కు మారినప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుందని.. తద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని తెలిపారు.
వృద్ధాప్యం, కొన్ని మందులు (మూత్రవిసర్జన, బీటా బ్లాకర్స్), స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ రుగ్మతలు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి అనారోగ్యాలు పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్‌కు దోహదపడే అనేక అంశాలు. కాగా ఇది తాత్కాలిక పరిస్థితి అని.. కానీ బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటే విపత్కర పరిణామాలను కలిగి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ అత్యంత హానికరమైన దుష్ప్రభావం మూర్ఛపోవడం. కానీ తీవ్రమైన సందర్భాల్లో మెదడుకు తక్కువ రక్త ప్రసరణ స్ట్రోక్‌కు దారితీయవచ్చు.
ఎలా ఎదుర్కోవాలి?
* భోజనానికి ముందు నీరు త్రాగాలి. ఆహారం లేదా అల్పాహారం తీసుకునే 30 నిమిషాల ముందు కనీసం 200 ml నీరు త్రాగాలి.
* తక్కువ మొత్తంలో భోజనం తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద మొత్తంలో భోజనం, స్మాల్ మీల్స్‌తో పోలిస్తే పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్‌ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమస్యలను నివారించడానికి రోజుకు మూడు సార్లు ఎక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకునే బదులు.. 6-7 సార్లు స్మాల్ క్వాంటిటీస్‌లో తీసుకునేందుకు ప్రయత్నించండి.
* భోజనం చేసిన తర్వాత తరచుగా తల తిరిగినట్లు అనిపిస్తే.. కొంత సమయం పాటు కూర్చోవడం లేదా పడుకోవడం చేయండి.
* అవసరమైన అన్ని పోషకాలు కలిగిన సమతుల్య ఆహారాన్ని తినాలి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను భోజనంలో చేర్చాలి.