ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీ రాకూడదంటే ఇలా చేయండి..

by Sumithra |
ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీ రాకూడదంటే ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో చీరలు, నగలను ఇష్టపడని మహిళలు ఉండరు. మహిళలు బయటకు షాపింగ్ కి వెళితే చాలు చీరలనో, నగలనో కొంటూఉంటారు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా, పార్టీలకు వెళ్లినా ధరించిన బట్టలకు సెట్ అయ్యే జ్యువలరీని వేసుకుంటూ ఉంటారు. బంగారం, వెండి ఆభరణాలు అయినా, ఇమిటేషన్ జ్యువెలరీ అయినా దేన్నైనా సరే అమితంగా ప్రేమిస్తారు. బంగారు నగలలో నచ్చని డిజైన్స్ ఉంటే మెటల్ నగలను ధరిస్తారు. అయితే కొంతమందికి మెటల్ నగలు ధరిస్తే ఇచ్చింగ్ వచ్చి ఇన్ఫెక్షన్స్‌ వస్తూ ఉంటాయి. అలెర్జీ కారణంగా చర్మం పై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట వస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుకున్న నగలు ధరించేందుకు ఏ టిప్స్ ని ఫాలో అవ్వాలి, నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ఆర్టిఫిషియల్ జ్యుయలరీ ధరించినప్పుడు అలర్జీ రాకుండా ఉండేందుకు నగలకు లోపలి వైపు నుంచి ప్లాటినం కోటింగ్‌ వేయించుకోవాలి.

మెడకు టైట్ గా ఉండే నగలను కాకుండా కాస్త వదులుగా ఉండే లాంగ్ నెక్లెస్ లాంటి వాటిని వేసుకోవాలి. మెడకు గాలి ఆడేలాగా చూసుకోవాలి.

అలాగే ఆర్టిఫిషియల్‌ నగల వేసుకునేముందు క్యాలమైన్ లోషన్స్‌, పౌడర్‌, మాయిశ్చరైజర్‌ వంటివి రాకుకోవడం ఉత్తమం.

ఆర్టిఫిషియల్‌ నగలు ధరించినప్పుడు మెటల్‌ ప్రభావం చర్మం పై పడకుండా ఉండేందుకు ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పాలిష్‌ ను నగలకు రాయాలి.

నగలు ధరించినప్పుడు దురదలు వస్తే కలబంద గుజ్జును రాయాలి.

చూశారు కదా ఈ టిప్స్ ని ఆచరిస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మెటల్‌ ఎఫెక్ట్‌ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. అప్పుడు మీకు నచ్చిన ఆర్నమెంట్స్ ని ధరించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed