- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇలా చేయండి..
దిశ, ఫీచర్స్ : పిల్లలు పుట్టినప్పటినుంచి వారు పెరిగి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్టుగా త్వరగా ఎత్తుపెరుగుతారు. కానీ మరికొంత మంది పిల్లలు వారి ఎత్తు పెరగడంలో వెనకబడి ఉంటారు. నెమ్మదిగా ఎత్తు పెరిగే వారు ఒక్కసారిగా పెరగడం ఆగిపోతారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల ఎత్తు విషయంలో ఆందోళన చెందుతారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
యోగా చేయడం..
పిల్లల శారీరక, మానసిక వికాసానికి యోగా చాలా ముఖ్యం. పిల్లల ఎత్తు పెరగకపోతే, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా చేసేలా చేయండి. దీనివల్ల పిల్లల ఎత్తు పెరగవచ్చు. సూర్య నమస్కారం, త్రికోణాసనం, తడాసనా, వృక్షాసనా వంటి అనేక సులభమైన వ్యాయామాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. అలాగే పిల్లలు ఉదయం, సాయంత్రం వేటినైనా చేతులతో పట్టుకుని వేలాడితే అది ఎత్తుపెరగడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుందని చెబుతున్నారు.
బహిరంగ ఆటలు
బహిరంగ ఆటలు ఆడేందుకు పిల్లలను ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. పిల్లలు సైకిల్ తొక్కడం, ఫుట్‌బాల్ లేదా బాస్కెట్‌బాల్ ఆడడం, రోప్ దూకడం, క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడితే వారు త్వరగా ఎత్తు పెరుగుతారట. ఇలా రోజూ ఏదో ఒకటి చేయడం వల్ల పిల్లల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఊబకాయం రాకుండా, ఎత్తు బాగా కనిపిస్తుంది.
పౌష్టికాహారం, సరైన నిద్ర..
ఈ రోజుల్లో పిల్లలు సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం అనే అలవాటు పూర్తిగా మర్చిపోయారు. పిల్లలు ఇంట్లో ఫుడ్ ని కాకుండా ఎక్కువగా బయటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయం సరైన సమయానికి లేవడం అలవాటు చేయండి.