ఆత్మవిశ్వాసం ఎదుట ఓడిన అంగవైకల్యం.. షారూఖ్ పాటకు యువతి నృత్యం.. వీడియో వైరల్

by Shiva |   ( Updated:2023-09-01 10:20:46.0  )
ఆత్మవిశ్వాసం ఎదుట ఓడిన అంగవైకల్యం.. షారూఖ్ పాటకు యువతి నృత్యం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : దృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం, ఏదైనా చేయాలనే తపన మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. టాలెంట్ అనేది అన్ని సందర్భాల్లో బయట పడదు. దానికి సమయం సందర్భం రెండూ కలిసి రావాలి. తాజాగా.. సుస్మితా చక్రవర్తి అనే అంగ వైకల్యం గల మహిళ షారూఖ్, ననయనతార నటించిన జవాన్‌ మూవీలోని 'చలేయా' బీట్‌కు తగ్గట్లుగా ముగ్ధ మనోహరంగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలో సుస్మితా ఓ కృత్రిమ కాలును ధరించి ఉండటం మనం గమనించవచ్చు. అయితే, గాయని శిల్పారావు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సుస్మితా డ్యాన్స్ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు 'ఆడాళ్లంతా నిన్ను చూసి ప్రేరణ పొందాలి' అంటూ కామెంట్ చేశారు. చాలా బాగా చేశారు.. అక్క అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

Advertisement

Next Story