- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపై డబ్బు దొరికిందా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
దిశ, ఫీచర్స్: మనం రోడ్డుపై నడిచేటప్పుడు, ఒక్కో సారి మనకు డబ్బు కనిపిస్తుంది. చాలా మంది అబ్బా.. డబ్బులు దొరికాయని సంతోషంగా వాటిని తీసుకుని బ్యాగ్ లో దాచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో దీన్ని తీసుకోవడం మంచిదికాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మన హిందూ సంప్రదాయంలో డబ్బును లక్ష్మి దేవిగా భావిస్తాం. మనకు డబ్బులు రోడ్డుపై కనబడితే చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లని కొందరు అంటుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం రోడ్డు పై దొరికిన డబ్బు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం, మీకు రోడ్డుపై డబ్బు దొరికితే, మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి.అవేంటో ఇక్కడ చూద్దాం..
డబ్బును అలాగే వదిలేయండి: డబ్బును అలాగే వదిలేయడం మంచిది.
సమీపంలోని ఆలయానికి విరాళం ఇవ్వండి: మీకు దొరికిన డబ్బును సమీపంలోని ఆలయానికి కూడా విరాళంగా ఇవ్వవచ్చు.
డబ్బు దాయడం : దొరికిన డబ్బును దాచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది మీకు చట్టపరమైన సమస్యలను కలిగిస్తుంది.
పేదలకు సహాయం చేయండి: అన్నం లేని వాళ్లకి ఆ డబ్బును దానం చేయండి.
పోలీసులకు కాల్ చేయండి: పోలీసులకు కాల్ చేసి, మీకు డబ్బు దొరికిందని చెప్పండి. వాళ్ళు వచ్చి మీ వద్ద డబ్బును తీసుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం, వీధిలో డబ్బు దొరకడం మంచి శకునం కాదు. దానిని తీసుకోవడం వల్ల మీకు దురదృష్టం కలగవచ్చు. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. డబ్బు కనిపించినప్పుడు వాటిని అసలు ఖర్చు పెట్టకండి.