మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన ఆ మూడు సినిమాలతోనే బన్నీ స్టార్ హీరో అయ్యాడా?

by Javid Pasha |
మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన ఆ మూడు సినిమాలతోనే బన్నీ స్టార్ హీరో అయ్యాడా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ దర్శకులు సాధారణంగా మంచి స్టోరీ ప్రిపేర్ చేసుకొని హీరోలను సంప్రదిస్తుంటారు. కానీ మహేశ్ బాబు విషయంలో మాత్రం అలా కాదు. అతన్ని సంప్రదించాకనే స్టోరీ రెడీ చేసేవారే ఎక్కువని టాక్. అంటే డైరెక్టర్లకు మహేశ్ బాబు ఫస్ట్ ఛాయిస్ అన్నమాట. ప్రజెంట్ అతను రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. అయితే అందుకోసం దాదాపు మూడేండ్లు పడుతుందట. ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం పార్టు 1, పార్టు 2 గా వస్తాయా లేదా అనే విషయమై ఎటువంటి క్లారిటీ లేదు.

ఇకపోతే మహేశ్ బాబు వద్దన్న మూడు కథలు వేరే అల్లు అర్జున్ వద్దకు వెళ్లాయని, మిల్క్ బాయ్ రిజెక్ట్ చేసిన ఆ కథల్లో నటించిన తర్వాతే బన్నీ స్టార్ హీరో అయిపోయాడని ప్రజెంట్ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అవేంటంటే.. గుణ శేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన రుద్రమా దేవి మూవీలో గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ అలరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ముందగా మహేశ్ బాబుతో తీయాలని, అతనికి స్టోరీ కూడా వినిపించాడట గుణ శేఖర్. ఇక అతను కాదనడంతో అల్లు అర్జున్‌తో తీశాడు. కానీ ఈ మూవీతో బన్నీ మరింత ఫేమస్ అయిపోయాడు.

అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా చేసిన మరో మూవీ అల వైకుంఠపురం కథను కూడా ముందుగా మహేశ్ రిజెక్ట్ చేశాడట. అల్లు అర్జున్ నటనతో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన మరో చిత్రం పుష్ప. ఈ కథను మహేశ్ బాబుతో తీయాలని ప్రిపేర్ చేయగా ఆయన కాదన్నాడు. దీంతో అల్లు అర్జున్‌తో తీయగా ప్రపంచ స్థాయి రికార్డు సాధించింది. పుష్పతో అల్లు అర్జున్ రేంజ్ ఏ లెవల్లో పెరిగిందో తెలిసిందే. ఈ సక్సెస్ దెబ్బతో పుష్ప 2, పుష్ప 3కి కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2లో చేస్తుండగా ఇది డిసెంబర్లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed