Diabetes : మీకు డయాబెటిస్ ఉందా..? వింటర్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

by Javid Pasha |
Diabetes : మీకు డయాబెటిస్ ఉందా..? వింటర్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
X

దిశ, ఫీచర్స్ : మీరు డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే చలికాలంలో జర జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వాతావరణం చల్లగా మారడంవల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుందని, ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ పెరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చలికి భయపడి కొందరు వ్యాయామాలు చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

వెచ్చటి దుస్తులు ధరించండి

డయాబెటిస్‌ పేషెంట్లు శీతాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. అందుకోసం మందంగా ఉండే ఉన్ని దుస్తులు ధరించడం, చల్లటి గాలికి గురికాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే డయాబెటిస్ కోసం వాడే మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అవి చల్లటి వాతావరణానికి గురయ్యే ప్రదేశంలో పెట్టకూడదంటున్నారు నిపుణులు.

వ్యాయామాలు తప్పనిసరి

వింటర్‌లో వెదర్ కూల్‌గా ఉంటంవల్ల చాలా మంది వ్యాయామాలు చేయడానికి వెనుకాడుతుంటారు. కానీ షుగర్ పేషెంట్లు అలా చేస్తే హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తాయి. రక్త ప్రసరణలో ప్రతికూల మార్పులు రావచ్చు. కాబట్టి తప్పకుండా వాకింగ్, రన్నింగ్ వంటివి చేయాలి. బయటికి వెళ్లలేకపోతే ఇంట్లోనే జుంబా, యోగా వంటి ఇండోర్ వ్యాయామాలు చేయాలని. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

వీటిని ఎక్కువగా తినాలి

డయాబెటిస్ ఉన్నవారు వింటర్‌లో ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. వెజిటేబుల్ సూప్‌లు, సీడ్స్, నట్స్ వంటివి తీసుకోవడంవల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే జలుబు, జ్వరం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం, బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed