Diabeses: డయాబెటిస్ ఉన్నవారు రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి.. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయ్ !

by Javid Pasha |
Diabeses: డయాబెటిస్ ఉన్నవారు రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి.. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయ్ !
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం చూస్తే.. మన దేశంలో 2019 లోనే 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రజెంట్ ఈ సంఖ్య 10.1 కోట్లకు పెరిగింది. భారతదేశ జనాభాలో కూడా 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిస్ లిస్టులో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అంటే వీరు త్వరలో డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంవల్ల డయాబెటిక్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటే చూద్దాం.

ఆలస్యంగా తినడం : డయాబెటిక్ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో తగిన కేర్ తీసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే చాన్సెస్ కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మరీ ఆలస్యంగా తినడమో, ఒక్కో రోజు ఒక్కో విధంగా తినడమో చేస్తే చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తుంటాయి. కాబట్టి ప్రతి రోజూ సమయానికి తినాలి. అలాగే భోజనం ముగిసిన తర్వాత రెండు లేదా మూడు గంటలకు షుగర్ టెస్టు చేసుకోవడంవల్ల మెడిసిన్ వాడకంలో జాగ్రత్త పడవచ్చు.

ఒకే సారి కడుపు నిండుగా తినడం : కొందరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకుండా లంచ్ టైమ్‌లోనే ఫుల్లుగా తినేస్తుంటారు. పోషకాల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఎంత ఫుల్లుగా తిన్నా తగిన పోషకాలు లేని ఆహారం డయాబెటిస్ వచ్చే రిస్కును పెంచుతుంది. కాబట్టి కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇలా అన్ని రకాల పోషకాలు మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

చిరు తిళ్లకు దూరంగా ఉండండి : ప్రస్తుతం చాలా మంది చిరుతిళ్లపై ఆసక్తి చూపడం మనం గమనిస్తుంటాం. ఇవి తక్షణ రుచిని, సంతృప్తిని ఇవ్వగలవు. కానీ ఆరోగ్యానికి మాత్రం మేలు చేయవు. చాలా మంది లంచ్ టైమ్‌లో కూడా అన్నం, రొట్టెలు వంటివి కాకుండా ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. దీనివల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.

భోజనం తర్వాత డ్రింక్స్ : కొందరు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు తాగుతుంటారు. ముఖ్యంగా శీతల పానీయాల్లో కార్బోనేటెడ్, చక్కెర పానీయాలే ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed