- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషుల్లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్.. అసలైన కారణం ఇదేనంట!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. మనం తీసుకునే ఆహారం, జీవన శైలి కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారం. అందువలన మంచి ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. కాగా, మగవారిలో స్పెర్మ్ తగ్గడానికి గల అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం ఎక్కువగా రసాయనలు చల్లి పండిస్తున్నారు. ముఖ్యంగా పురుగుల మందులు అధికంగా వాడుతున్నారు. ఇలాంటి ఆహారం తినడం వలన స్పెర్మ్ కైంట్ తగ్గిపోతుందంట. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లోని పరిశోధన కొన్ని పురుగుమందులకు గురికావడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం మధ్య సంబంధాన్ని తెలియజేసింది. కీటకాల మంది ప్రజలకు హాని చేస్తోందని వారు ఓ సర్వేద్వారా నిరూపించారు.
ముఖ్యంగా స్ట్రాబెర్రీ, స్పినాచ్, కాలే, కొల్లార్డ్, ఆవాలు, ఆకుకూరలు, యాపిల్స్, ద్రాక్ష, చెర్రీస్, బ్లూబెర్రీస్, గ్రీన్ బీన్స్ వంటి వాటిని పండించే సమయంలో ఎక్కువ పురుగుల మందులను వాడుతున్నారంట. అందువలన మార్కెట్‌లో ఎదైనా కొనేముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. కాస్త తక్కువ ధరకు ఏవైనా అమ్ముతున్నారంటే అనుమానపడి, మంచివి తీసుకోవాలని చెబుతున్నారు. పురుషులు సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలని చెబుతున్నారు.
అయితే కొన్ని సందర్భల్లో సీజన్ టైమ్ కాకపోయినా, సీజనల్ ఫ్రూట్స్ మార్కెట్‌లో అమ్ముతారు. అయితే అలాంటి వాటిని కొనుగోలు చేసి అస్సలే తినకూడదంట. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా దీని వలన స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని చెబుతన్నారు వైద్యులు. అలాగే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ముఖ్య కారణం ఒత్తిడి, టెన్షనేంట.