- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dark Oxygen : సృష్టి ఉద్భవించింది ఈ మహాసముద్రంలోనే.. అంతుచిక్కని రహస్యాన్ని గుర్తించిన శాస్త్రవేత్త
దిశ , ఫీచర్స్:సాధారణంగా సూర్యరశ్మి, మొక్కలు, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తారు సైంటిస్టులు. ఇప్పటి వరకు ఇదే నమ్మారు కూడా. కానీ సరికొత్తగా ఇవేవీ లేకుండానే పసిఫిక్ మహాసముద్రంలో 13000 అడుగుల లోతులో ఆక్సిజన్ ఉందని కనిపెట్టారు సముద్ర శాస్త్రవేత్త ఆండ్రూ స్వీట్ మ్యాన్. ఇంతలోతులో మొక్కలు, సూర్య కిరణాలు లేనప్పుడు ప్రాణవాయువు ఎలా ఉత్పత్తి అవుతుందనే అనుమానంతో.. తన దగ్గర ఉన్న పరికరాలు సరిగ్గా పనిచేయలేదు అనుకుని మళ్లీ మాన్యుఫాక్చరర్ కు ఇచ్చాడు. కానీ అవి కరెక్ట్ గానే ఉన్నాయని స్పష్టం చేశారు. అంటే ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందనే నిర్ధారణకు వచ్చారు.
ఊహించని విధంగా మైనింగ్ ప్రాంతంలో సముద్ర జీవవైవిధ్యాన్ని అంచనా వేస్తున్నప్పుడు సముద్రపు అడుగుభాగంలో "డార్క్" ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడుతుందని స్వీట్‌మ్యాన్ గమనించాడు. ఈ ప్రాంతంలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ ఉంటాయి. షెల్ శకలాలు, స్క్విడ్ ముక్కులు, సొరచేప దంతాలతో కూడిన రసాయన ప్రక్రియల ద్వారా మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని అంచనా.
కాగా మొక్కలు, ప్లాంక్టన్, ఆల్గే వంటి కిరణజన్య సంయోగ జీవులు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి. తరువాత అది సముద్రపు లోతులలోకి వెళ్తుంది. గత అధ్యయనాలు అక్కడ జీవులు ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకుంటాయని, దానిని ఉత్పత్తి చేయవని చెప్పాయి. కానీ స్వీట్‌మ్యాన్ బృందం ఇటీవలి పరిశోధన ఈ నమ్మకాన్ని సవాలు చేసింది. కిరణజన్య సంయోగక్రియ లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తిని గుర్తించింది. ఇటువంటి ఊహించని ఫలితాలు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్న ఆయన.. డార్క్ ఆక్సిజన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే అసలు సృష్టి ఎలా ఉద్భవించిందనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నాడు. సముద్రంలోనే మొదలైందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు.