నిద్రలో అతిగా గురక పెడుతున్నారా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

by Sumithra |
నిద్రలో అతిగా గురక పెడుతున్నారా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మీ ఇంట్లో ఎవరైనా నిద్రపోతున్నప్పుడు గురక పెడితే వారి అలవాటును చూసి నవ్వడం, ఎగతాళి చేయడం అస్సలు చేయకండి. అలాంటి వ్యక్తులు మృత్యువు అంచున నిలబడి ఉన్నారని తెలుసుకోండి. సాధారణ వ్యక్తుల కంటే గురక పెట్టే వారికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆకస్మికంగా గుండె ఆగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యనిపుణులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రంగా గురక పెట్టేవారు నిద్రిస్తున్నప్పుడు చనిపోవచ్చని చెబుతున్నారు. అందుకే గురక అనేది సాధారణ వ్యాధి కాదు అని అది తీవ్రమైన ఇబ్బందులకు ఆహ్వానం పలుకుతుందని తెలుసుకోవలంటున్నారు నిపుణులు.

కొంతమంది ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే గురక పెట్టే వారికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధి ఉంటుందని చెబుతున్నారు. ఈ గురక మెడ పొట్టిగా ఉండటం, స్థూలకాయం, టాన్సిల్స్ పెద్దవిగా ఉండడంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల వస్తాయంటున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు కండరాలు రిలాక్స్ అయ్యి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లినప్పుడు గాలి ప్రవాహం తగ్గుతుందంటున్నారు. అలాంటి వారు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు గురక వస్తుంది. అంతే కాదు రాత్రిపూట తరచుగా నోరు పొడిబారిపోతూ ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే మెదడు, గుండె మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఆక్సిజన్ తక్కువగా చేరడం వల్ల కొంతమంది వ్యక్తులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

గురకకు కారణాలు..

గురక సమస్య స్థూలకాయుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. స్థూలకాయులలో 70 నుంచి 80 శాతం మంది గురక పెడుతుంటారని చెబుతున్నారు. పెద్ద పొట్ట, లావు మెడ, గొంతు లోపల కొవ్వు పేరుకుపోయిన వ్యక్తులు గురకకు గురవుతారు. అంతే కాదు ముక్కు ఎముక వంకరగా లేదా జలుబు కారణంగా కూడా శ్వాసలో అవరోధం, గురక వస్తుందంటున్నారు నిపుణులు.

గురకకు చికిత్స ఏమిటి ?

బరువు తగ్గడం : గురకను ఆపడానికి సులభమైన, అతి ముఖ్యమైన మార్గం బరువు తగ్గడం. బరువు తగ్గడం వల్ల గురక కూడా తగ్గుతుంది.

సి-పాప్ మెషిన్ : సి-పాప్ (నిరంతర సానుకూల వాయుమార్గ పీడనం) : యంత్రం నిద్రిస్తున్నప్పుడు ముక్కు, గొంతు పై ఉంచుతారు. ఈ యంత్రం గాఢ నిద్రలో కూడా సరైన గాలి ఒత్తిడిని నిర్వహిస్తుంది. దీని కారణంగా వ్యక్తికి మంచి నిద్ర వస్తుంది. ఆక్సిజన్ కూడా శరీరానికి చేరుకుంటుందంటున్నారు నిపుణులు.

ఆపరేషన్ : గురకకు మూడవ చికిత్స ఆపరేషన్. ఒకరి టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, గొంతు నిర్మాణం గాలి పీడనం చేరుకోలేని విధంగా ఉంది. అప్పుడు శస్త్రచికిత్స అవసరం. ENT సర్జన్లు ఈ ఆపరేషన్ చేస్తారు.

డెంటల్ ఉపకరణాలు : నాల్గవ చికిత్సగా డెంటల్ ఉపకరణాలు కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ ప్రతి రోగికి వేర్వేరు ఉపకరణాలు అవసరమవుతాయి. ఇది దవడను కొద్దిగా ముందుకు తీసుకొచ్చి గురకను తగ్గిస్తుంది. తరచుగా నిద్రకు భంగం కలిగించే సమస్య నుంచి ఉపశమనం పొందుతుందంటున్నారు నిపుణులు. ఇవి తేలికపాటి సందర్భాల్లో మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయంటున్నారు.

విదేశాల్లో కూడా గురక పెద్ద సమస్య..

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ వ్యాధితో ఇబ్బంది పడేవారు అధికంగా ఉన్నారంటున్నారు నిపుణులు. గురక లేదా స్లీప్ అప్నియా కారణంగా రాత్రంతా నిద్రపోలేని వారు పగటిపూట వాహనం నడుపుతూ, నిద్రపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధి చాలా విధాలుగా కనిపించేంత సాధారణమైనది కాదు అని దాని పరిణామాలు దారుణంగా ఉంటాయంటున్నారు నిపుణులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story