బోర్లా పడుకొని నిద్రపోతున్నారా.. ఇది మీ కోసమే..

by Sumithra |
బోర్లా పడుకొని నిద్రపోతున్నారా.. ఇది మీ కోసమే..
X

దిశ, ఫీచర్స్ : నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొంత మంది నిటారుగా పడుకుంటే మరి కొంతమంది ముడుచుకుని పడుకుంటారు. కొంతమంది ముసుగు వేసుకుని పడుకుంటే కొంతమంది బోర్లా పడుకుంటారు. వారి వారి అలవాట్లను బట్టి వారికి ఏ భంగిమలో సుఖంగా ఉంటారో ఆ భంగిమలో నిద్రపోతారు. అయితే కొన్ని భంగిమల్లో పడుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరి ఏ భంగిమలో పడుకోకూడదు.. అలా పడుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..

ఎక్కువ శాతం మంది అలసిపోయినప్పుడు బోర్లా తిరిగి నిద్రపోతూ ఉంటారు. ఇలా పడుకుంటే శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెడ నొప్పి రావనిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొంత మంది నిటారుగా పడుకుంటే మరి కొంతమంది ముడుచుకుని పడుకుంటారు.డంతో పాటు వెన్నెముకను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పులు ఒక్కోసారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుగా కూడా మారే అవకాశం ఉంది. బోర్లా పడి నిద్రపోతే కడుపు మీద ఒత్తిడి పడి ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో కడుపు నొప్పి అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది. అంతే కాదు బోర్లాపడుకుంటే మొఖం మీద చర్మం సాగిపోయి మడతలు పడే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్లా పడుకోకూడదని నిపుణుల అభిప్రాయం.

Advertisement

Next Story

Most Viewed