Health Benefits of Eating Curd : ఈ వ్యాధుల నివారణలో పెరుగు కీలక పాత్ర.

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-18 15:23:47.0  )
Health Benefits of Eating Curd : ఈ వ్యాధుల నివారణలో పెరుగు కీలక పాత్ర.
X

దిశ, ఫీచర్స్ : పెరుగు...పోషకాహారం. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ పవర్‌హౌస్. మెరుగైన జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకీ అవేవీ? ఎలాంటి వ్యాధుల నివారణకు హెల్ప్ చేస్తుంది? తెలుసుకుందాం.

జీర్ణక్రియ

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అదనంగా కడుపుపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గుదల

బరువు తగ్గడం విషయానికి వస్తే అధిక ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని అనుసరించడం చాలా కీలకం. పెరుగులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి, ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. తిండి కోరికలను తగ్గిస్తుంది. ఒబేసిటీ రాకుండా అడ్డుకుంటుంది.

ఎముకలు, దంతాల బలం

ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ కారణంగా.. పెరుగు ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి గొప్ప సూపర్ ఫుడ్,

బీపీ కంట్రోల్

పెరుగులో ఉండే ప్రోబయోటిక్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఇది అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు స్థాయిలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే తక్కువ కొవ్వు, కొవ్వు లేని పెరుగు రకాలను ఎంచుకోండి.

ఇమ్యూనిటీ బూస్టర్

ప్రోబయోటిక్స్ కాకుండా... పెరుగులో కాల్షియం, విటమిన్లు B12, విటమిన్ డి వంటివి ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తికి, పూర్తి ఆరోగ్యానికి కీలకమైనవి. కాగా క్రమం తప్పకుండా తీసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

మధుమేహం

పెరుగు తీసుకోవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే పెరుగు.. మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed