- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యల సైజు, బరువుపై క్రూరమైన జోకులు ఆగవా?
దిశ, ఫీచర్స్ : సాధారణంగా పెళ్లి సమయంలో సన్నగా, నాజూగ్గా ఉండే అమ్మాయిలు.. పిల్లలు పుట్టడం, అనారోగ్య సమస్యలు వెంటాడటం వంటి సందర్భాల్లో లావెక్కుతారు. మళ్లీ బరువు తగ్గేందుకు, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్తలు సపోర్ట్ ఇవ్వడానికి బదులుగా వెక్కిరిస్తుంటారు. కాగా దీనిపై స్పందించిన ప్రముఖ పోషకాహార నిపుణులు.. ఇలాంటి ధోరణి ఇంకా మారట్లేదని తెలిపారు. మహిళ శ్రేయస్సుకు నష్టం కలిగించే రెడ్ ఫ్లాగ్స్ గురించి ఓపెన్ గా చర్చించారు. ఎంతమంది భర్తలు తమ భార్యలను ఈ విషయంలో చేరదీశారనే విషయంపై మాట్లాడారు.
కొంతమంది పురుషులు స్త్రీల కంటే వేగంగా బరువు కోల్పోతారు. కానీ అది బయాలజీ వల్ల కాదు. వారి భార్యలు తయారుచేసిన ఆరోగ్యకరమైన భోజనంతోపాటు ఇందుకు అవసరమైన అన్ని రకాల మద్దతును పొందడం వల్లే సాధ్యం అవుతుంది. కానీ భర్తలు మాత్రం తమ భాగస్వామి వెయిట్ లాస్ జర్నీలో కనీసం వన్ పర్సంట్ కూడా హెల్ప్ చేయరు. పోషకాహార నిపుణులతో ఇంటరాక్షన్ సమయంలో వైఫ్ తో హాజరయ్యే పురుషులు.. ఆహారం, వ్యాయామం, మానసిక కల్లోలం గురించి భార్య క్రమశిక్షణతో లేకపోవడాన్ని ఫిర్యాదు చేస్తారు. కానీ భార్యలు మాత్రం వారికి అన్నివేళలా సహకరిస్తారు. భర్తల జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్లాన్, షెడ్యూల్, వంట, సమన్వయం.. మొత్తానికి ఏది అవసరమో అది చేసి పెడుతారు.
కానీ 2024లో కూడా.. భార్య కోసం ఏం చేయగలను అనే భర్తను ఇంకా కలవలేదని చెప్పారు నిపుణులు. బాడీ సైజ్, సెన్సిటివిటీపై క్రూరమైన జోకులు వేస్తారని.. వైఫ్ చెప్పే విషయాలు అసలు విలువలేనివనే అభిప్రాయంతో అడ్డుకోవడం, వారి బాధను కేర్ చేయకుండా సెషన్ మధ్యలోనే ఫోన్ అంటూ బయటకు వెళ్లిపోవడం చేస్తుంటారని.. భార్యలు అనుభవించే అలజడి, గాయం, అలసటను గమనించడంలో విఫలమవుతారని అభిప్రాయపడ్డారు. పైగా ఆమెను ఎగతాళి చేస్తారని, అవమానిస్తారని.. ఇదంతా భయంకరంగా అనిపిస్తుందని తెలిపారు.
Read More..