Cristiano Ronaldo - YouTube: యూట్యూబ్‌ రికార్డులన్నీ తిరగరాసిన క్రిస్టియానో రొనాల్డో.. నిమిషాల్లో లక్షల మంది సబ్ స్కైబర్లు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-22 12:50:18.0  )
Cristiano Ronaldo - YouTube: యూట్యూబ్‌ రికార్డులన్నీ తిరగరాసిన క్రిస్టియానో రొనాల్డో.. నిమిషాల్లో లక్షల మంది సబ్ స్కైబర్లు..
X

దిశ, ఫీచర్స్ : లెజెండరీ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టాడు. తొంభై నిమిషాల్లో పది లక్షల మంది సబ్ స్కైబర్స్ కు పైగా సొంతం చేసుకుని రికార్డు సెట్ చేశాడు. కాగా బుధవారం ప్రారంభించిన ఛానల్ కు ఇప్పటి వరకు 11.8 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు ఉండగా.. వన్ మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సాధించిన అత్యంత వేగవంతమైన యూట్యూబ్ ఛానల్ గా గోల్డెన్ బటన్ అందుకున్నాడు. తన కుటుంబంతో ఈ మోమెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న వీడియోను కూడా షేర్ చేసుకున్నాడు.

"నిరీక్షణ ముగిసింది. నా @YouTube ఛానెల్ ఎట్టకేలకు వచ్చింది! SIUUU సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ కొత్త ప్రయాణంలో నాతో చేరండి" అని రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయగా ఫ్యాన్స్ ఫాలో అయిపోయారు. ప్రస్తుతం ఈ ఛానెల్ లో 12 వీడియోలు ఉండగా.. వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించినవి ఉన్నాయి. ఇక రొనాల్డోకు Xలో 112.5 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Next Story