- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ చిన్న చిన్న అడుగులే మీ కుటుంబ, ఆర్థిక విజయానికి సోపానాలు
దిశ, ఫీచర్స్ : ‘జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలంటే డబ్బును ఆదా చేయడం నేర్చుకోవాలి’ అంటుంటారు పెద్దలు. సంపాదించడం ఒక ఎత్తైతే వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి?. ఎలా పొదుపు చేయాలి? అనే విషయంలో క్లారిటీ కలిగి ఉండటం మరో ఎత్తు. ఈ విషయాలపై ఆధారపడే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆనందమయ జీవితాలు ముడిపడి ఉంటాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ కుటుంబ ఆర్థిక లావాదేవీల విషయంలో తగిన ప్లాన్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కాగా ఇటీవల కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కుటుంబ బడ్జెట్ ప్లాన్స్‌కు సంబంధించిన విషయాలపై ప్రజెంట్ చాలామంది డిస్కస్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగానూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే అనుసరించాల్సిన బడ్జెట్ ప్రణాళికలను, పొదుపు అంశాలను వివరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితితో నిండిన ప్రపంచంలో, ఆర్థిక స్థిరత్వంవైపు నావిగేట్ చేయడానికి తగిన బడ్జెట్‌ను క్రియేట్ చేయడం మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు.
పరిస్థితులు, ఫైనాన్సియల్ గోల్స్
మీరు ఆర్థిక స్థిరత్వం కలిగి ఉండాలంటే అందుకు తగిన ప్లాన్ చేయాలి. అంతకంటే ముందు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని నిశితంగా పరిశీలించడం ద్వారా ప్రారంభించండి. మీ ఆదాయం, ఖర్చులు, అప్పులను నిశితంగా అంచనా వేయండి. ఇది మీ ఆర్థిక విజయానికి పునాది వంటిది. అలాగే స్పష్టమైన ఫైనాన్సియల్ గోల్స్ సెట్ చేసుకోవడం ముఖ్యం. ఇప్పటికే మీకు అనేక ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఉండి ఉండవచ్చు. ఇంటి కోసం పొదుపు చేసినా, పిల్లల చదువులకోసం నిధులు సమకూర్చినా, కంఫర్టబుల్ రిటైమర్మెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నా మీ గోల్స్‌ను మేనేజ్ చేయడం చాలా ముఖ్యం.
50/30/20 రూల్ పనిచేస్తుంది !
సక్సెస్ ఫుల్ బడ్జెట్ మీ ప్రత్యేకమైన జీవనశైలికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ఆదాయంతో సరిపోయే వాస్తవిక బడ్జెట్‌ను ఎలా సృష్టించాలో ఆలోచిస్తే తగిన మార్గం దొరుకుతుంది. మీ ఆర్థిక నిర్వహణకు ఆచరణాత్మక, సమర్థవంతమైన సాధనంగా మారుతుంది. అందుకోసం 50/30/20 రూల్ బాగా పనిచేస్తుందని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్తున్నారు. దీని ప్రకారం మీ ఆదాయంలో 50% నిత్యావసరాలకు, 30% వ్యక్తిగత కోరికలకు, 20% సేవింగ్, అలాగే రుణ చెల్లింపులకు కేటాయించాలి. ఈ బ్యాలెన్స్‌డ్ స్టైల్ మీ లైఫ్ క్వాలిటీని త్యాగం చేయకుండానే మీ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో గొప్పగా సహాయపడుతుంది.
అనవసర ఖర్చులను తగ్గించుకోండి
ఆర్థిక పరిస్థితిని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీ ఖర్చులను ట్రాక్ చేయండి. అంటే.. మీ డబ్బు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతుందో పర్యవేక్షించడానికి సాధారణ స్ప్రెడ్ షీట్స్‌ను ఉపయోగించండి. ఈ విధమైన ఇన్ఫర్మేషన్ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, తగ్గించగల ఖర్చులను గుర్తించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఫైనాన్షియల్ గోల్స్ నెరవేరాలంటే మీ బడ్జెట్ నుంచి అనవసరమైన ఖర్చులను ఎప్పుడూ తగ్గిస్తూ ఉండాలి. అందుకోసం మీ రోజువారీ ఖర్చు అలవాట్లను అంచనా వేయండి. లైఫ్ క్వాలిటీతో రాజీపడకుండానే మనీ సేవ్ చేయగలిగే అంశాలను గుర్తించండి.
ఎమర్జెన్సీ ఫండ్ ఎంతో ముఖ్యం
ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏ అనారోగ్యం సంభవిస్తుందో, ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏర్పడుతుందో చెప్పలేం. అందుకే ఎప్పుడూ మీ కుటుంబ అవసరాలకోసం ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఆర్థిక, కుటుంబ భద్రతకు చాలా ముఖ్యం. మూడు నుంచి ఆరు నెలల విలువైన జీవన వ్యయాలను ఆదా చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఈ ఫండ్ మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ఊహించని ఆర్థిక వైఫల్యాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
వ్యూహాత్మక రుణ చెల్లింపులు
మీకు బ్యాంకు రుణాలు, బయట పలుచోట్ల అప్పులు ఉండవచ్చు. కుటుంబం అన్నాక అందరికీ ఉంటాయి. అయితే రుణాన్ని సకాలంలో చెల్లిస్తే ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అందుకోసం వ్యూహాత్మక బడ్జెట్ చెల్లింపులు అనుసరించాలని నిపుణులు చెప్తున్నారు. ఇందుకోసం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించండి. మీ బడ్జెట్‌ను బట్టి నెలవారీగా, రోజువారీగా, ఏడాదికోసారి ఇలా ఏ పద్ధతి మీకు సులువైతే ఆ పద్ధతిని ప్లాన్ చేసుకోండి. దీనివల్ల కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటుంది. మరోవైపు అప్పులు కూడా తీరిపోతాయి. మీరు వేగంగా రుణ విముక్తి పొందడంలో సహాయపడుతుంది.
హౌసింగ్ బడ్జెట్, రవాణా ఖర్చులు
సొంత ఇల్లు కలిగి ఉండాలనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండే కామన్ డ్రీమ్. అయితే మీ ఆదాయాన్ని బట్టి, మీరు ఖర్చులను మేనేజ్ చేసే పద్ధతిని బట్టి కూడా అది నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలివిగా బడ్జెట్ చేయండి. మీ ఆర్థిక పరిస్థితికి తగిన ధరలో గృహ ఎంపికలను పరిగణించండి. అద్దె లేదా తనఖా నిబంధనలను చర్చించండి, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే రీఫైనాన్సింగ్ లేదా తగ్గింపును అన్వేషించండి. ఇక రవాణా ఖర్చుల విషయానికి వస్తే సాధ్యమైనప్పుడు బైకింగ్ లేదా కాలి నడక ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. అప్పుడప్పుడూ కొలీగ్స్‌తో కార్‌పూలింగ్ చేయడం లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించడం కూడా మీ ఖర్చును ఆదా చేస్తుంది. ఇటువంటి చిన్న మార్పులే మీ నెలవారీ బడ్జెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.