Cramps : కాళ్లు, చేతులు తిమ్మిర్లకు గురవుతున్నాయా?

by Prasanna |   ( Updated:2023-02-16 07:21:27.0  )
Cramps : కాళ్లు, చేతులు  తిమ్మిర్లకు గురవుతున్నాయా?
X

దిశ, వెబ్ డెస్క్ : మన శరీరం సరిగ్గా పని చేయాలంటే అనేక రకాల పోషకాలు అవసరం. ప్రోటీన్లు, కాల్షియం , విటమిన్లు, ఖనిజాలు , ఐరన్ , కార్బో హైడ్రేట్లు వంటి అనేక పోషకాలు అవసరం. వీటన్నింటి పని తీరు వల్ల శరీరం మెరుగ్గా పని చేస్తుంది. వీటిలో ఏదైనా లోపం ఉంటే శరీరం కొన్ని సంకేతాలను అందిస్తుంది. కాళ్లు , చేతులు తిమ్మిర్లకు గురవుతుంటే శరీరంలో విటమిన్ల లోపం ఉందని అర్ధం.

దీంతో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. శరీరంలోని విటమిన్ బి , ఈ ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండు విటమిన్ల లోపం ఉంటే అప్పుడు చేతులు, కా ళ్ళలో తిమ్మిర్ల సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా చేతులు, కాళ్ళు క్రమంగా పని చేయడం మానేస్తాయి. దీని నివారణకు పచ్చి కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పులు , సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed