పిల్లల్ని కనడానికి ఇష్టపడని కపుల్స్.. కారణం ఏమిటంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-03-20 09:09:09.0  )
పిల్లల్ని కనడానికి ఇష్టపడని కపుల్స్.. కారణం ఏమిటంటే?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు పెళ్లై సంవత్సరం తిరగక ముందే ఒళ్లో చంటి పాపతో దర్శనం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లై ఐదు పది సంవత్సరాల తర్వాత పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వారు పిల్లలను కనడానికి ఎందుకు అంతగా ఇష్టం చూపడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ : ఆర్థికంగా ఎదిగాక, పిల్లలను కనాలని కొంత మంది ప్లాన్ చేసుకుటున్నారంట. ప్రస్తుతం చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇక పెళ్లి అయ్యాక సరిపోని సాలరీస్‌తో ఇంటి ఖర్చులు, కుటుంబాన్ని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి సమయంలోనే పిల్లలు అనేది వారికి ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పిల్లలను కనాలనుకుంటున్నారంట, ఈ జనరేషన్ వారు.

కెరీర్ : దంపతులు వారి టైమ్, ఆలోచనలన్నీ కూడా వారి ఎదుగుదల, కెరీర్‌ని చక్కగా బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే వాడాలనుకుంటున్నారు. ఈ కారణంగా పిల్లల్ని కనే ఆలోచన పోస్ట్‌పోన్ చేస్తున్నారు. పిల్లల్ని కంటే తాము అనుకున్న మార్గంలో ఎదగలేమని భావించి ఆ కారణాలతో పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు.

లైఫ్ ఎంజాయ్ చేయడం : కొంత మంది దంపతులు వెకేషన్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మ్యారేజ్ లైప్, వివిధ ప్రాంతాలకు వెళ్లి, ఇద్దరే హ్యాప్పీగా గడపాలి అనుకుంటారు. అందువలన లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొంత మంది పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు అంటున్నారు నిపుణులు.

చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకోవడం : ఒకప్పుడు 18 ఏళ్లు నిండిన తర్వాతనే పెళ్లి చేసుకునే వారు కానీ, ఇప్పుడు 30 ఏళ్లు వచ్చినా పెళ్లీలు కావడం లేదు. కానీ కొంత మంది చాలా చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అలాంటి వారు త్వరగా పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదంట.

Advertisement

Next Story

Most Viewed