సింగిల్స్‌తో పోలిస్తే దంపతుల్లోనే శృంగార (SEX) సంతృప్తి అధికం.. ఎందుకంటే?

by sudharani |   ( Updated:2022-09-16 05:48:28.0  )
సింగిల్స్‌తో పోలిస్తే దంపతుల్లోనే శృంగార (SEX) సంతృప్తి అధికం.. ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా సింగిల్స్‌ సెక్సువల్ లైఫ్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం. రోజుకొకరితో హ్యాపీగా గడిపేస్తారని భావిస్తాం. కానీ శృంగారం గురించి ఆరాటపడే సింగిల్స్‌ కంటే రిలీజియస్ కపుల్స్ మెరుగైన లైంగిక అనుభవం పొందుతుంటారని తాజా అధ్యయనం తెలిపింది. 18-59 సంవత్సరాల వయస్సు గల 15,000 మంది పురుషులు, మహిళలకు సంబంధించిన బ్రిటీష్ నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ ఆటిట్యూడ్స్ డేటాపై రీసెర్చ్ చేసిన ఎక్సెటర్ యూనివర్సిటీ నిపుణులు ఈ విషయాన్ని నిర్ధారించారు.

వాస్తవానికి బహుళ భాగస్వాములతో కాజ్యువల్ సెక్స్ కాలక్రమేణా లైంగిక సంతృప్తిని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. 'అదే పెళ్లితో ఒక్కటైన జంటలు సెక్స్‌లో పాల్గొనే అవకాశం తక్కువ. అంతేకాదు ప్రేమపై ఆధారపడిన ఈ బంధానికి శృంగారాన్ని పరిమితం చేసే అవకాశం ఉంది. అంటే అధికారికంగా కలిసుంటున్న వీరిమధ్య లైంగిక కార్యకలాపాలపై తక్కువ అంచనాలకు దారి తీస్తుంది. సంతృప్తిపడేలా చేస్తుంది' అని అధ్యయన రచయిత డాక్టర్ వెగార్డ్ స్కిర్బెక్ వివరించారు. లైంగిక సంతృప్తి అనేది ఎమోషన్స్‌తోనూ ముడిపడి ఉంటుందని, కేవలం శరీరానికే పరిమితం కాదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

పార్ట్‌నర్స్ చీటింగ్.. అవమానం ఎవరికి?

బాంబు పేల్చిన రమ్యకృష్ణ.. డైరెక్టర్స్ చెప్పినట్లు హీరోయిన్స్ చేస్తే ఆఫర్సే కాకుండా.

Advertisement

Next Story

Most Viewed