వెరైటీ వెడ్డింగ్ కార్డు : దయచేసి మీరు పెళ్లికి రావొద్దని పత్రికలు పంచిన వధూవరులు.. ఒక వేళ వస్తే మాత్రం..

by Sujitha Rachapalli |
వెరైటీ వెడ్డింగ్ కార్డు : దయచేసి మీరు పెళ్లికి రావొద్దని పత్రికలు పంచిన వధూవరులు.. ఒక వేళ వస్తే మాత్రం..
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండ్ అవుతుందంటే కచ్చితంగా వెరైటీగానే ఉంటుంది. ఫన్, ఎమోషన్ పీక్స్ లో ఉండేదే అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా అలాంటిదే. కాగా ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేయగా వైరల్ అయింది. సాధారణంగా వధూవరులు తమ పెళ్లి మరో పది, పదిహేను రోజులు ఉందనగానే స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారికి వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తారు. తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వస్తారు. కుటుంబం మొత్తం రావాలని చెప్తుంటారు. కానీ ఓ జంట మాత్రం ఇందుకు విరుద్ధంగా చేసింది.

తమ పెళ్లికి రావద్దని చుట్టాల్లో కొందరికి స్పెషల్ వెడ్డింగ్ కార్డు పంపించారు. ఇక ఆహ్వానించిన బంధువులు మాత్రం ఊరికే కూర్చుంటారా ఏంటి? తమ పెళ్లి అయిపోయాక ఫోటోషూట్ చేస్తున్నప్పుడు.. చెయిర్స్ సెట్ చేయాలని, భోజనాలకు, రిసెప్షన్ కి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. అలా అయితేనే మ్యారేజ్ కు రావాలని స్పష్టం చేశారు. కాగా ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. పాపం వధూవరులు ఇద్దరు కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదనుకుంటా అని సెటైర్స్ వేస్తున్నారు. పెళ్లికి వెళ్లకూడదని సాకులు వెతుక్కునే వారికి ఇది జాక్ పాట్ అని మరికొందరు అంటున్నారు. ఇక చివరగా పెళ్లికి పిలవని స్నేహితులను శ్రీమంతానికి పిలుస్తుందట వధువు.

Advertisement

Next Story