Cool Drinks : సమ్మర్ సీజనల్‌లో కూల్ డ్రింక్స్ అంత మంచిది కాదు !

by Prasanna |
Cool Drinks : సమ్మర్ సీజనల్‌లో కూల్ డ్రింక్స్ అంత మంచిది కాదు !
X

దిశ, ఫీచర్స్ : ఇక దాదాపు సమ్మర్ సీజన్ వచ్చేసినట్లే. పగటిపూట ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అయితే వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఎండలో నుంచి వచ్చిన వారు వెంటనే ఉపశమనం కోసం చల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింగ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయేగానీ ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు చెప్తున్నారు. పైగా వీటిలో శరీరానికి అవసరం లేని అధిక కేలరీలు ఉంటాయి. వాటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలను రోజూవారీ ఆహారంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సమ్మర్‌లో శరీరంలోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. బాడీలో నీటిశాతం తగ్గితే డీ హైడ్రేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అలాగే సమ్మర్‌లో ప్రోటీన్లు కలిగిన ఫుడ్ తీసుకోవడం బెటర్. పండ్ల విషయానికి వస్తే స్ట్రాబెర్రీ, కర్బూజ, తర్బూజ, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. చర్మానికి బ్లడ్ సర్క్యూట్‌ చేయడంలో ఇవి కీలకపాత్ర పోషించడంతో పాటు వేడిని తగ్గిస్తాయి.

ఎండలో నుంచి వచ్చినప్పుడు, ప్రయాణాల వేళ అలసటగా అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్‌కు బదులు కోకోనట్ వాటర్, నిమ్మరసం, మజ్జిగ, చల్లటి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే సమ్మర్‌లో అందరికీ అందుబాటులో ఉండే మామిడి పండ్లలో ఫైబర్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఐరన్‌, వివిధ పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేడి వాతావరణాన్ని తట్టుకునేలా నీటిశాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవాలి. వీటివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. సిట్రస్ పండ్లతోపాటు సమ్మర్‌లో లభించే ద్రాక్షపండ్లు తినాలి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలతోపాటు సి విటమిన్ ఉండటంవల్ల ఆరోగ్యానికి మంచిది. టైప్ 2 డయాబెటిస్ ప్రభావాన్ని కూడా ద్రాక్షపండ్లు తగ్గిస్తాయి. సమ్మర్‌లో ఆయిల్ ఫుడ్, టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకోవద్దని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story