మందు బాబులకు అలర్ట్..ఫుల్‌‌గాతాగి ఈ ట్యాబ్ లెట్ వేసుకుంటే డేంజర్‌లో పడ్డట్లే!

by Jakkula Samataha |
మందు బాబులకు అలర్ట్..ఫుల్‌‌గాతాగి ఈ ట్యాబ్ లెట్ వేసుకుంటే డేంజర్‌లో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నా.. దాన్ని వదలడం లేదు కొందరు. ఆల్కహాల్ సేవించి ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా, ఆ తర్వాత కొన్ని రకాల ట్యాబ్ లెట్స్ వాడి మరిన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు.అసలు విషయంలోకి వెళ్లితే.. చాలా మంది మద్యం సేవించి పారాసెటిమాల్, డోలో లాంటి ఫీవర్ ట్యాబ్ లెట్స్ వాడుతుంటారు.

అయితే అవి అస్సలే వాడకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మద్యం సేవించిన తర్వాత ఎలాంటి మెడిసన్ వాడకూడదంట. ఎందుకంటే తాగిన తర్వాత 25 గంటల పాటు అది మన శరీరంలో ఉంటుందంట. ఇది ప్రతిచర్యలకు కారణం కావచ్చునంట, అందువలన తాగిన తర్వాత జ్వరం మందులు డోలో, పారాసిటమాల్ లాంటివి అస్సలే వాడకూడదంట.ఒక వేళ ఇవి వాడితే వాంతులు, తల తిరగడం లాంటివి అవుతుంటాయంట. ఒక్కోసారి దీంతో ప్రాణాలకు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు వైద్యులు.అంతే కాకుండా అల్సర్ లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయంట.

Advertisement

Next Story