నవజాత శిశువు విషయంలో తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు.. అవేంటంటే

by Kavitha |
నవజాత శిశువు విషయంలో తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు.. అవేంటంటే
X

దిశ, సినిమా: సాధారణంగా పిల్లల విషయంలో మనకు తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అది వారిపై ప్రభావం చూపిస్తుంది. మారుతున్న ప్రపంచంతో బిడ్డను ప్లాన్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ ముందు నుంచే శిశువుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను ప్లాన్ చేయడం.. పాఠశాల విద్య, తమ బిడ్డకు ఆర్థికంగా ఇవ్వాలనుకుంటున్న విలాసాల నుండి ప్రతిదానికి లెక్కలు వేసుకుంటారు. కానీ శిశువు పుట్టిన తర్వాత కంగారులో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు. మరి చాలా మంది కొత్త తల్లిదండ్రులు తరచుగా చేసే కొన్ని సాధారణ తప్పులు ఏంటో ఇక్కడ చూద్దాం.

చిన్న విషయాలకు భయపడటం:

కామన్‌గా తల్లిదండ్రులకి శిశువు ఏడుపు, నిద్రపోవడం, తినడం అన్నీ వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మీ ఆందోళన వలన శిశువుకు మంచి చేయవు గాక బదులుగా వారికి చిరాకు కలిగిస్తుంది. కాబట్టి పసి పాపను చూసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కూల్‌గా ఉండాలి. ఒక వేళ ఏదైనా విషయంపై మీకు టెన్షన్‌గా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించింది మీ ప్రాబ్లమ్స్ గురించి అతనితో చర్చించండి.

తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం:

బిడ్డకు తల్లిపాలు పోషకాహారం. కాబట్టి బిడ్డకు ఎప్పటికప్పుడు తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. బాగా తల్లిపాలు తాగిన శిశువు రాత్రంతా ఏడవ చెందకుండా నిద్రపోతారు అనే విషయం గుర్తు పెట్టుకోండి.

నోరు శుభ్రంగా ఉంచుకోవడం:

సాధారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డ నోటిని శుభ్రం చేయడం మర్చిపోతారు. పిల్లల నోరు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ శిశువు చిగుళ్లను మెత్తటి కాటన్ గుడ్డతో తుడిచి శుభ్రంగా ఉంచండి.

అభిప్రాయం మాత్రమే ముఖ్యమైనది:

మొదటి కొన్ని నెలల్లో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరూ శిశువును ఎలా చూసుకోవాలో మీకు సలహా ఇస్తారు. కేవలం వాటిని గుర్తుంచుకోండి, మీ అభిప్రాయం మాత్రమే ఇంపార్టెంట్. శిశువుకు ఏది సరైనదో అదే చేయండి. అలాగే పేరెంటింగ్ విషయంలో మూఢనమ్మకాల జోలికి అస్సలు పోకూడదనే విషయం బాగా గుర్తు పెట్టుకోండి. ఇన్‌కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే డాక్టర్‌ని సంప్రదించండి.

ఇతరులతో పోల్చవద్దు:

కొత్త తల్లిదండ్రులు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఇది ఒకటి. శిశువు ఇంప్లిమెంటేషన్‌ని ఇతరులతో పోల్చవద్దు. ప్రతి శిశువుకు భిన్నమైన వృద్ధి రేటు ఉంటుంది.

శిశువును పట్టుకునే టెక్నిక్:

శిశువును పట్టుకునే టెక్నిక్ చాలా ముఖ్యం. నవజాత శిశువు మెడ కండరాలు పుట్టిన తర్వాత చాలా సెంన్సిటీవ్‌గా ఉంటాయి. అవి అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కాబట్టి మీరు శిశువును మీ చేతుల్లో పట్టుకున్న ప్రతిసారీ శిశువు తలకి మద్దతు ఇవ్వాలి అనే విషయం మర్చిపోవద్దు.

బిడ్డకు స్నానం చేయించడం:

పిల్లలకు స్నానం చేయించడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. శిశువుకు స్నానం చేయించేటప్పుడు గోరు వెచ్చని నీటితో సున్నితంగా రుద్ది చేయించండి. బలం ఉంది కదా అని గట్టిగా చేతులతో రుద్దకండి.

ఆకలితో ఉన్న శిశువు సంకేతాలు:

బిడ్డకు తల్లి పాలు క్రమం తప్పకుండా ఇవ్వాలి. వారికి ఆకలేసినప్పుడు పెదవి నొక్కడం, ఏడవడం, చప్పరించడం, నోటికి చేతులు పెట్టడం లాంటివి చేస్తారనే విషయం గుర్తు పెట్టుకోండి.

కాళ్లు, చేతులు కడుక్కున్నాకే ఎంట్రీ:

చిన్న పిల్లలను చూసేందుకు ప్రతి ఒక్కరూ వస్తుంటారు. కాబట్టి ఎవరైనా వచ్చినా కాళ్లు, చేతులు సరిగ్గా కడుక్కున్నాకే మీరు శిశువు ఉన్న గదిలోకి రానివ్వాలి. ఎందుకంటే పిల్లలకు త్వరగా అంటువ్యాధులు రావొచ్చు.

తగిన దుస్తులు వేయాలి:

శిశువుకు బాగా టైట్‌గా ఉన్న దుస్తులు వేయకూడదు. అలాగే డైపర్ల అవసరం చాలా ఉంటుంది కాబట్టి బిడ్డను ఇంటికి తీసుకురావడానికి ముందే వీటిని కొనడం మర్చిపోవద్దు. అలాగే డైపర్లను ఎప్పటికప్పుడు మార్చాలి. లేకుంటే దద్దుర్లు రావచ్చు.

మసాజ్ చేయండి:

శిశువుకు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ఎముకల పెరుగుదలకు, ప్రశాంతమైన నిద్రను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

సిద్ధంగా ఉండండి:

స్టార్టింగ్ స్టేజ్‌లో పిల్లలు పగలు ఎక్కువ సమయం నిద్రపోతారు. అలాగే రాత్రి సమయంలో ఎప్పుడైనా మేల్కొంటారు. అందువలన మీరు చిరాకు పడకుండా వారు నిద్రపోతున్నప్పుడే మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి సిద్ధంగా ఉండండి.

Advertisement

Next Story

Most Viewed