Success : జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తుల సాధారణ అలవాట్లు.. ఎదుగుదలకు ఇవే కారణమా?

by Javid Pasha |
Success : జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తుల సాధారణ అలవాట్లు.. ఎదుగుదలకు ఇవే కారణమా?
X

దిశ, ఫీచర్స్: జీవితం ఒక నదిలాంటిది. ప్రవాహంలో ఎన్నో మలుపులు ఉంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని ఓటమిపాలు చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు విజయం వైపు నడిపిస్తుంటాయి. ఇక గెలుపోటములతో సంబంధం లేకుండా శ్రమనే నమ్ముకొని నిరంతర ప్రవాహంలా సాగిపోయేవారు ఎప్పటికైనా సక్సెస్ అనే గమ్యాన్ని చేరుతారని నిపుణులు చెప్తుంటారు. అయితే సక్సెస్ ఫుల్ వ్యక్తులను గమనిస్తే వారు సహజంగానే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటారని, వారి విజయానికి కారణమైన వాటిలో అవి కూడా ఒకటని చెప్తారు. అలాంటి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా, ఉద్యోగం చేస్తున్నా, చేయకపోయినా కొందరు తాము చేసే పనులు టైమ్ ప్రకారం చేస్తుంటారు. సమయపాలనకు విలువ ఇస్తారు. ఉదయం పూట ఫలానా టైమ్‌‌కు లేవాలని డిసైడ్ అయితే ప్రతిరోజూ ఆ సమయాన్ని కచ్చితంగా ఫాలో అవుతుంటారట.

* నిద్ర లేచాక ఆ రోజు చేయాల్సిన పనులను గుర్తు తెచ్చుకొని ఒక నిర్ణయానికి వస్తారట సక్సెస్ ఫుల్ ప్రజలు. దీంతో పనిపట్ల క్లారిటీ వస్తుంది. సకాలంలో అనుకున్నది పూర్తి చేసేస్తారు. అలాగే ఉదయం పూట వ్యాయామాలు, బ్రేక్ ఫాస్ట్ కూడా సక్సెస్ ఫుల్ వ్యక్తుల జీవితంలో తప్పక కనిపించే సాధారణ అలవాటుగా నిపుణులు పేర్కొ్టున్నారు.

* పొద్దున్న మెసేజ్‌లు, ఈ మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఆ రోజు తమకు కావాల్సిన విషయాలపట్ల అప్డేట్ అవడం వంటివి తప్పక చేస్తుంటారు. అనవసర అంశాలపై ఫోకస్ చేయకుండా ఆ రోజు తాము ఏం చేయాలనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అట్లనే ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు.

* ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లప్పుడూ వెన్నంటే ఉండేది కుటుంబ సభ్యులే. కాబట్టి జీవితంలో విజయం కోరుకునేవారు తమ కుటుంబానికి మొదటి ప్రయారిటీ ఇస్తుంటారని నిపుణులు చెప్తున్నమాట. అలాగే ప్రతికూల ఆలోచనలు, కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే. కానీ సక్సెస్ ఫుల్ ప్రజలు వీటిని చూసి భయపడరు. వాటిని ఎలా అధిగమించాలో ప్రయత్నిస్తుంటారు. అందుకే వారు సక్సెస్ అవుతారు.

* ఒక లక్ష్యాన్ని చేరాలంటే అందుకు తగిన అవగాహన, అధ్యయనం ముఖ్యం. కాబట్టి విజయవంతమైన వ్యక్తుల జీవితంలోనూ ఇది కనిపిస్తుంది. వారు నిరంతర అధ్యయనానికి ప్రయారిటీ ఇస్తారు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో, అమలు చేయడంలో ముందుంటారని నిపుణులు చెప్తున్నారు.

* ముఖ్యమైన విషయం ఏంటంటే.. విజయం అనేది ఇలాగే ఉంటుందని, ఈ విధంగానే ప్రయత్నించాలని చెప్పడానికి ఉండదు. దానికి కచ్చితమైన నిర్వచనమంటూ ఏదీ లేదంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరూ తామున్న పరిస్థితుల్లో కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే విజయం సాధించడానికి అవసరమైన ఆలోచనలు వస్తాయని, మార్గాలు కనిపిస్తాయని అంటున్నారు. సక్సెస్ ఫుల్ వ్యక్తులందరిలో సహజంగా ఉండే అలవాటు కూడా ఇదే. అందుకే వారు విజయం సాధించి ఉంటారేమో!

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed