Cockroaches: అక్కడ బొద్దింకలు బంగారంతో సమానం..! కేజీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Kavitha |
Cockroaches: అక్కడ బొద్దింకలు బంగారంతో సమానం..! కేజీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా లేక పోవడం వల్ల వివిధ రకాల కీటకాలు ఇంట్లోకి చేరుతుంటాయి. అలా చేరిన వాటిలో ముఖ్యంగా ఎక్కువగా మనకు కనిపించేవి బొద్దింకలు అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తరిమికొట్టడానికి మనం వివిధ రకాల రసాయనాలు వాడుతాము. అయినా అవి నశించవు. కొంత మందికి వాటిని చూసినా కూడా అన్నం తినబుద్ధి కూడా కాదు. అలాంటి ఈ బొద్దింకలు అక్కడ బంగారంతో సమానం. ఒకపక్క బొద్దింకలు మరోపక్క గోల్డ్ ఉంచి ఏది కావాలో కోరుకోండి అని వారిని అడిగితే వారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ బొద్దింకలనే ఛూస్ చేసుకుంటారట. మరి ఇంతకీ బొద్దింకలకు అంత ప్రయారిటీ ఇస్తున్న ప్లేస్ ఎక్కడ? అలాగే అవి ఎందుకంత స్పెషల్‌నో ఇప్పుడు మనం చూద్దాం..

సాధారణంగా మనం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల జంతువులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటారనే విషయం తెలిసిందే. అలా ఆహారంగా తీసుకునే వాటిలో బొద్దింక ఒకటి. చైనా, ఆఫ్రికా దేశాల్లో వీటిని ఆహారంగా ఉపయోగిస్తారు. మరి వీరు వాటిని తినడానికి మైన్ రీసన్ మాత్రం వాటిలో ఉండే కొన్ని పోషకాలే. అందుకే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బొద్దింకలు బంగారంతో సమాన ధరలు పలుకుతున్నాయి. చేపలు, మేకలు, కోడిలో ప్రోటీన్ కంటెంట్ ఉన్నట్లే, బొద్దింకలు కూడా 14 శాతం ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటాయన్నట్లు సమాచారం. ఈ కారణంగా చైనా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో బొద్దింకలను ఆహారంగా ఉపయోగిస్తారు. అయితే బొద్దింకలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో.. మన దేశంలో గొర్రెలు, కోళ్లను పెంచుతున్నట్లు.. కొన్ని దేశాల్లో బొద్దింకలను కూడా పెంచే పనిలో పడ్డారట. అలా పెంచిన బొద్దింకలను మంచి ధరకు విక్రయిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో ఇతర నాన్ వెజ్ వినియోగం మాదిరిగానే బొద్దింక వినియోగం కూడా పెరగవచ్చని అంటున్నారు.

ఇక ఆఫ్రికాలోని టాంజానియాలో బొద్దింకలు సమృద్ధిగా పెరుగుతాయి. ఇక్కడ 1KG బొద్దింకలు 5 యూరోలకు విక్రయిస్తున్నారు. అంటే మన కరెన్సీలో రూ. 459. అలాగే బొద్దింకలతో నూనె కూడా ఉత్పత్తి చేస్తున్నారట. కాగా బొద్దింకను కొందరు గిరిజనులు తమ ప్రధాన ఆహారంగా కూడా భావిస్తున్నారట. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింకలను ఉత్పత్తి చేసే కర్మాగారం చైనాలోని జిచాంగ్‌లో ఉంది. ఇక్కడ, బొద్దింకలు AI సహాయంతో ఉత్పత్తి చేయబడతాయి. ఈ దేశంలోని రెస్టారెంట్లలో బొద్దింకలకు ప్రత్యేక వంటకం కూడా ఉంది. ఇది కాకుండా, బొద్దింకలను ఔషధాలు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే బొద్దింకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌లో బంగారం ధర పలుకుతోంది.

Advertisement

Next Story

Most Viewed