- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరంగా చిల్ర్డన్స్
దిశ, ఫీచర్స్ : ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ లేదా శారీరక శ్రమ లేకపోవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గల కారణాలలో నాలుగోది. ఇది దీర్ఘకాలిక వ్యాధులకు, వైకల్యాలకు కూడా దారి తీస్తోంది. ఇప్పటికీ అప్రమత్తం కాకపోతే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది వివిధ రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేసింది. అందుకే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని.. వాకింగ్, సైక్లింగ్, గేమ్స్‌తో ఫిట్‌నెస్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కనీసం 60 నిమిషాలు
5 నుంచి 17 ఏండ్లలోపు వయస్సుగల పిల్లలు, టీనేజర్స్ రోజుకూ కనీసం 60 నిమిషాలైనా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాలని ప్రపపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) సిఫార్సులు పేర్కొంటున్నాయి. బలమైన కండరాలు, శారీరక దృఢత్వం కోసం వీక్లీ త్రీ డేస్ ఏరోబిక్ కార్యక్రమాలను కలిగి ఉండాలి. పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు వంటివి ఎక్కువ చూడకూడదని.. ఒకవేళ చూసినా రోజు మొత్తంలో వాటికి కేటాయించే సమయం రెండు గంటలకు మించి ఉండకూడదని తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు, ఆ తర్వాత కూడా పిల్లలు, టీనేజర్స్‌లో శారీరక శ్రమ లేదా వ్యాయామాల స్థాయి డబ్ల్యుహెచ్‌వో సిఫార్సులకంటే తక్కువగా ఉంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వారిలో 81 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరమయ్యారు. దీనివల్ల టీనేజర్స్‌లో చురుకుదనం లోపించిందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
డబ్ల్యుహెచ్‌వో యాక్షన్ ప్లాన్
2016 బేస్‌లైన్‌గా డబ్ల్యుహెచ్‌వో 2030 నాటికి 'గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ' ద్వారా టీనేజర్స్ వ్యాయామానికి లేదా శారీరక శ్రమకు దూరంగా ఉంటున్న పరిస్థితిని కనీసం 15 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అన్ని దేశాలు, ప్రభుత్వాలు ఫిజికల్ యాక్టివిటీస్ కార్యక్రమాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. గ్లోబల్ ఫిజికల్ ఇనాక్టివిటీ క్రైసిస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సరైన డేటా సేకరించాలని సూచించింది. డబ్ల్యుహెచ్‌వో పిలుపును అందుకున్న యాక్టివ్ హెల్తీ కిడ్స్ గ్లోబల్ అలయన్స్ ఇటీవల ఫిజికల్ యాక్టివిటీస్‌పై వెల్లడైన అధ్యయనాన్ని ప్రచురించింది. ఇది మొట్టమొదటి సారిగా శారీరక శ్రమకు దూరమవుతున్న పరిస్థితులను అంచనా వేసింది. 2022లో వెల్లడైన వివరాల ప్రకారం 682 మంది నిపుణులు పిల్లలు, యుక్త వయస్సులు దూరమవుతున్న 10 సాధారణ శారీరక శ్రమలను అంచనా వేశారు.
మూడింటిలో ఒక వంతు మాత్రమే !
అయితే ఇప్పటి వరకూ పిల్లలు, టీనేజర్స్‌లో శారీరక శ్రమ ఇంకా మెరుగుపడలేదని అధ్యయనం పేర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలు, యుక్తవయస్కులు మాత్రమే తగినంత శారీరక శ్రమను కలిగి ఉన్నారు. మిగతా వారు ఫిజికల్ ఇనాక్టివ్స్‌వల్ల వినోద భరితమైన కార్యక్రమాలకు, స్ర్కీన్‌లకు దగ్గరయ్యారు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎదుర్కొంటున్నవారు కూడా పెరుగుతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి.
కరోనా ప్రభావంతో
ఫిజికల్ యాక్టవిటీస్ గురించిన అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది నిపుణులు పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరం కావడంవల్ల ప్రజారోగ్యం సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ -19 తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. దీని కారణంగా శారీరక శ్రమకు దూరమైనందున పిల్లల ప్రవర్తనలో మార్పులు, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కలుగుతున్నాయని వెల్లడించారు. కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్‌లు పాఠశాలలు, పబ్లిక్ పార్క్‌ల మూసివేతకు దారితీయడం కూడా ఇందుకు కారణమయ్యాయి. ఆ సమయంలో పిల్లల శారీరక శ్రమ రోజుకు 17 నిమిషాలు తగ్గుతూ వచ్చిందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే సిఫార్సు చేయబడిన రోజువారీ కార్యాచరణలో దాదాపు మూడింట ఒక వంతు తగ్గింపును కలిగి ఉంది. 187 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ప్రపంచ అధ్యయనం ప్రకారం.. లాక్ డౌన్ కాలాన్ని పరిశీలిస్తే వ్యక్తుల రోజువారీ శారీరక శ్రమ కార్యాచరణలో 27.3 శాతం తగ్గుదల కనిపించింది.
ఆఫ్రికన్ దేశాల్లో
ఫిజికల్ యాక్టివిటీస్ అంచనా వేసేందుకు నిపుణులు నాలుగు ఆఫ్రికన్ దేశాలైన బోట్స్వానా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా జింబాబ్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ గ్రేడ్ల పరంగా పరిశీలించినప్పుడు బోట్స్వానా దేశం ముందున్నది. మిగతా మూడు ఆఫ్రికన్ దేశాలకు చెందిన పిల్లలు యుక్తవయస్కులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పిల్లలకంటే ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా కలిగి ఉన్నారు. ఉమ్మడి కుటుంబం, ఫ్రెండ్స్, వివిధ కమ్యూనిటీలు, పాఠశాలల్లో ప్లేగ్రౌండ్స్ వంటి వనరులు అందుబాటులో ఉండటం వంటి కొన్ని పరిస్థితులు శారీరక శ్రమలో మెరుగుదలకు దోహదపడతాయి. ఈ విషయంలో కూడా ఆఫ్రికన్ దేశాలు మరింత మెరుగుదల సాధించాల్సి ఉంది. ప్రపంచ దేశాలతోపాటు ఆఫ్రికన్ దేశాల్లో ఫిజికల్ యాక్టివిటీస్‌ను పెంచేందుకు తగిన కార్యాచరణను చేపట్టాలని, సురక్షితమైన బహిరంగ ప్రదేశాలు, హరిత ప్రదేశాలు, క్రీడా ప్రాంగణాలు, సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని డబ్ల్యుహెచ్‌వో నిపుణుల బృందం సిఫార్సు చేసింది.