- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fish and Fever : జ్వరం వస్తే చికెన్ తినకూడదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
దిశ, ఫీచర్స్ : చికెన్.. ప్రస్తుతం నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ప్రధాన ఆహారంలో ఇదొకటి. పైగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలని పోషకాహార నిపుణులు కూడా చెప్తుంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ తిన కూడదని, తింటే పచ్చకామెర్లు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. ఇంతకీ ఇది నిజమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
చికెన్‌లో చాలా పోషకాలు ఉంటాయి. కూరగా వండుకొని తినడంవల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. దీంతోపాటు కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ కూడా ఉండటంవల్ల అధిక బరువు తగ్గడంలో, కండరాల బలోపేతానికి మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు, కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇన్ని విధాలుగా మేలు చేస్తున్న చికెన్ జ్వరం వచ్చినప్పుడు తింటే పచ్చ కామెర్లు వస్తాయి? అంటే ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు.
జ్వరం నుంచి కోలుకునే చాన్స్
కాకపోతే జ్వరం వచ్చినప్పుడు వ్యక్తి నీరసంగా మారుతారు. ఆహారం సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు చికెన్ తింటే త్వరంగా జీర్ణం కాకపోవడంవల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు మాత్రమే తినకపోవడం ఒక బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే ప్రత్యామ్నాయంగా చికెన్ గ్రేవీని తినడం లేదా సూప్ తాగడం వంటివి చేయవచ్చు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఒకవేళ జ్వరం వచ్చినప్పటికీ ఆహారం తినగలిగే శక్తి ఉన్నప్పుడు చికెన్ కూడా హ్యాపీగా తినవచ్చు. పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల తగిన శక్తి లభించి జ్వరం నుంచి త్వరగా కోలుకునే చాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే తప్ప చికెన్ తినడంవల్ల పచ్చ కామెర్లు వస్తాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.