Karela oil: కాకరకాయ నూనెతో జుట్టు రాలే సమస్యకు చెక్.. ఆ ప్రాబ్లమ్స్ కూడా మాయం!

by Javid Pasha |   ( Updated:2024-09-12 16:05:39.0  )
Karela oil: కాకరకాయ నూనెతో జుట్టు రాలే సమస్యకు చెక్.. ఆ ప్రాబ్లమ్స్ కూడా మాయం!
X

దిశ, ఫీచర్స్ : నూనెల్లో చాలా రకాలు ఉంటాయి. వంటనూనె, దీపం నూనె, అలాగే జుట్టుకు, చర్మ సంరక్షణకు ఉపయోగించేందుకు కూడా వేర్వేరు ఆయిల్స్ ఉంటాయి. అలాంటి వాటిలో కాకరకాయ నూనె ఒకటి. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంవల్ల కరేలా ఆయిల్ జుట్టు రాలే సమస్యను, చుండ్రును నివారిస్తుంది. రోజూ తలకు రాయడంవల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉన్నందున కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా కనిపిస్తారు.

రక్త ప్రసరణ మెరుగు పడుతుంది

కాకరకాయ ఆయిల్ జుట్టుకు రాయడంవల్ల ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా తల భాగంలో రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నందున చుండ్రు సమస్య కూడా పోతుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున చర్మానికి కాకరకాయి ఆయిల్ తరచుగా రాస్తూ ఉంటే స్కిన్ అలెర్జీలు రాకుండా ఉంటాయని, అలాగే మృతకణాలు నశించడంవల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. అలాగే దీనిని వంటకాల్లో ఉపయోగిస్తే డయాబెటిస్ రోగులకు మంచిదట. రక్తంలో చక్కెరస్థాయిలో అదుపులో ఉంటాయని చెప్తారు. కడుపులో ఉబ్బరం, ఎసిడిటి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed