- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండాలా?.. అయితే బార్లీ వాటర్ తాగండి !
దిశ, ఫీచర్స్: సమ్మర్‌లో బార్లీ వాటర్ తాగడంవల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు చెప్తున్నారు. బార్లీ గింజలను నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే పరిగడుపు తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల షుగర్, బీపీ కంట్రోల్ అవడంతోపాటు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య దూరం అవుతుందట. గుప్పెడు బార్లీ గింజలను ఒక లీటర్ నీటిలో కలిపి 15 నిమిషాలపాటు ఆ నీటిని వేడిచేయాలి. దీనివల్ల బార్లీ గింజల్లోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. తర్వాత ఆ నీటిని తాగడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
పరిగడుపున బార్లీ నీటిని తాగితే పెద్దపేగు శుభ్రం అవుతుంది. ఇది కోలన్ క్యాన్సర్ సమస్యను, శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. కడుపులో మంటగా అనిపించడాన్ని, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉండటం మూలంగా బార్లీ నీటిని తాగడంవల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. డయాబెటిస్ రోగులు బార్లీ నీటిని తాగడంవల్ల దాని ప్రభావం తగ్గుతుంది. ఫైబర్ కలిగి ఉన్నందున జీర్ణశక్తికి దోహదపడుతుంది. అధిక బరువు సమస్యను నివారిస్తుంది. చెడు కొలెస్ర్టాల్‌ను, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. గర్భిణులు బార్లీ వాటర్ తాగడంవల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం కూడా బార్లీ గింజలకు ఉంటుంది.