కోపం కంట్రోల్ తప్పుతోందా?.. ఇవి తినకండి !

by Javid Pasha |
కోపం కంట్రోల్ తప్పుతోందా?.. ఇవి తినకండి !
X

దిశ, ఫీచర్స్ : మనిషికి కోపం రావడం సహజ లక్షణాల్లో ఒకటి. కానీ అది సందర్భోచితంగా ఉన్నప్పుడే. ఎప్పుడంటే అప్పుడు వస్తోందంటే మాత్రం హైబీపీ వల్లో, ఇతర అనారోగ్య కారణాలవల్లో కావచ్చు. కొందరు ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటుంటారు. కారణం లేకుండానే కోప్పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా సదరు వ్యక్తి ఆరోగ్యం పాడవడంతోపాటు స్నేహితులు, ఆత్మీయులు దూరం అయ్యే చాన్స్ ఉంటుంది. అయితే కోపాన్ని పెంచడంలో కొన్ని రకాల ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. వాటిని తినకూడదని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

షుగర్ రిచ్ ఫుడ్స్

చాక్లెట్లు, స్వీట్లు, క్యాండీలు, కూల్ డ్రింగ్స్‌లలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ రిచ్ ఫుడ్స్ కోపాన్ని పెంచుతాయి. తరచూ తినడంవల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది మానసిక అల్లకల్లోలాన్ని, చిరాకును కలిగిస్తుంది. క్రమంగా డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి బేకరీ ఫుడ్స్ నివారించాలి.

ప్రాసెసింగ్ ఫుడ్స్

ఎక్కువసేపు నూనెలో వండటం, కాల్చడం వంటివి చేస్తారు కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు రుచిగా అనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ప్రాసెస్ చేయడంవల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతుంది. ఇది మీ న్యూరోట్రాన్స్ మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే తరచూ తినడంవల్ల మెంటల్ డిజార్డర్స్‌కు కారణం అవుతాయి. శారీరక బలహీనతతోపాటు కోపాన్ని ప్రేరేపిస్తాయి.

కెఫిన్, సాల్ట్, కారం

టీ, కాఫీలు ఎక్కువగా తాగడంవల్ల మీరు కెఫిన్ కంటెంట్‌ను ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే సాల్ట్‌లోనూ కెఫిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవద్దు. కెఫిన్, సాల్ట్ లెవల్స్ అధికంగా ఉంటే వాటిని తినేవారిలో యాంగ్జైటీస్, కోపం, పలు రకాల మెంటల్ డిజార్డర్స్ పెరిగే అకాశం ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్స్ కూడా కొంతమందిలో కోపం, హై స్ట్రెస్ పెరుగుదలకు కారణం అవుతాయి.

ఆల్కహాల్, ధూమపానం

తరచూ ఆల్కహాల్ సేవించడం, ధూమపానం చేయడం కోపాన్ని పెంచుతుంది. దీంతోపాటు జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు వస్తాయి. లంగ్స్ క్యాన్సర్‌కు కూడా కారణం అవుతాయి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారిలో ఆక్సిటోసిన్ వంటి ఆర్మోన్ల విడుదల తగ్గిపోతుంది. ఫలితంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. దీనివల్ల కోపం పెరుగుతుంది. అది మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed