- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ రకమైన ఆహారాలు గట్ హెల్త్‌ను దెబ్బతీస్తాయో తెలుసా?
దిశ, ఫీచర్స్: మనం హెల్తీగా ఉంటున్నామంటే.. జీర్ణక్రియకు దోహదం చేసే గట్ సక్రమంగా పనిచేయడమేనని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మనం తీసుకునే ఆహారాన్ని చిన్న చిన్న అణువులుగా విడగొడుతుంది. కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను గ్రహిస్తుంది. వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. శరీరంలో జీవక్రియలకు బాధ్యత వహిస్తుంది.
గట్ లేదా ప్రేగును జీర్ణ వాహిక అని కూడా పిలుస్తారు. ఇది నోటి నుంచి మొదలై పాయువు వద్ద ముగుస్తున్న పొడవైన గొట్టం అని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు చెప్తున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను శరీరానికి అందజేయడంతో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాక ఇది ప్రత్యేకమైన రోగ నిరోధక కణాలను కలిగి ఉండటంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొన్నిరకాల ఆహారాలు గట్ ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి. వాటి ఎఫెక్ట్‌వల్ల జీర్ణక్రియ, జీవక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రేగుల ఆరోగ్యానికి హానిచేసే అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రిఫైన్డ్ షుగర్స్
రిఫైన్డ్ షుగర్, హై షుగర్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల పేగులో హానికరమైన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇది మరికొన్ని చెడు బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీసి, గట్ మైక్రోబయోటాకు సంబంధించిన సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి అధికంగా రిఫైన్డ్ షుగర్స్ తీసుకోకపోవడం మంచిది.
ఆర్టిఫిషియల్ స్వీట్స్
ఆర్టిఫిషియల్ స్వీట్స్ వివిధ కృత్రిమ పదార్థాలను ప్రాసెస్ చేయడానికి (digest) యూజ్ చేస్తారు. ఇవి మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడిచేస్తాయి. గట్ వాపునకు కారణం అవుతాయి. అస్పర్టమే, సుక్రోలోజ్ (aspartame and sucralose) వంటి కొన్ని కృత్రిమ స్వీటెనర్లు ప్రేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. గట్ బ్యాక్టీరియా కూర్పును మార్చడంవల్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. కాబట్టి తరచుగా కృత్రిమ స్వీట్ తీసుకోవద్దు.
సంతృప్త కొవ్వులు
సంతృప్త కొవ్వులు(Saturated fats) వివిధ వేయించిన ఆహారాలను అధికంగా తినడం ద్వారా శరీరంలో సంతృప్త కొవ్వులు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా తినడంవల్ల గట్ ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరంగా మారుతుంది. అంతేగాక సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి అనారోగ్య కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు గట్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. గట్‌లో మంటకు దోహదపడతాయి. జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. గట్-సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రాసెస్డ్ ఫుడ్స్
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అధిక మొత్తంలో ఉప్పు, కొవ్వు, చక్కెర, వివిధ ఆహార పదర్థాల ఉనికిని కలిగి ఉంటాయి. వీటిని తినడంవల్ల గట్ మైక్రోబయోటా మారడంవల్ల పేగులో వాపు వస్తుంది. అంతేగాక ప్రాసెస్ లేదా అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తరచుగా కృత్రిమ పదార్థాలను కలిగి ఉంటాయి. అవి సాధారణంగా తక్కువ ఫైబర్, అనారోగ్య కొవ్వులు, శుద్ధి చేసిన చక్కెరలు, ఉప్పు ఎక్కువగా ఉండటం మూలంగా మంటను ప్రేరేపిస్తాయి. ఫలితంగా లీకీ గట్ సిండ్రోమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్ వంటి వంటి సమస్యలు వస్తాయి. వీటితోపాటు వెజ్ బేబుల్ ఆయిల్స్ (సోయా సాస్, టొమాటో సాస్ వంటివి )కూడా అధికంగా వాడొద్దు. వీటిలో ఒమేగా-6, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధిక నిష్పత్తిలో ఉండటంవల్ల ఉబ్బరం, వాపు, గట్ లైనింగ్ సమస్యలు వస్తాయి.
ఆల్కహాల్
మద్యం ఎక్కువగా తీసుకోవడంవల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది. ఎండోటాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది డైస్బియోసిస్ లేదా బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీయవచ్చు. ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, చిన్న పేగు బాక్టీరియా పెరుగుదల వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. కొన్నిరకాల యాంటీ బయాటిక్స్ గట్ మైక్రోబయోటా సమతుల్యతను ప్రభావితం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి డాక్టర్లు సూచిస్తే తప్ప వీటిని వాడకూడదు.
ఫైబర్స్‌తో మెరుగైన ఆరోగ్యం
గట్ ఆరోగ్యం బాగుండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది తక్కువగా ఉండే ఆహారం జీవితకాలంలో ఎక్కువగా తీసుకోవడంవల్ల జీర్ణక్రియకు దోహదం చేసే బ్యాక్టీరియా క్షీణించే అవకాశం ఉంటుంది. గట్ మైక్రోబయోటాలో అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే ఆహారంలో భాగంగా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకోవాలి.