సెలబ్రిటీలు స్నానం చేసే వింత విధానం.. వారు ఫిట్‌గా ఉండటానికే ఇలా చేస్తారా..

by Sumithra |
సెలబ్రిటీలు స్నానం చేసే వింత విధానం.. వారు ఫిట్‌గా ఉండటానికే ఇలా చేస్తారా..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో ఐస్ బాత్ అంటే ఐస్ వాటర్‌లో స్నానం చేసే ట్రెండ్ పెరిగిపోతుంది. సెలబ్రిటీలు అయినా, సామాన్యులైనా సరే, ప్రతి ఒక్కరూ దీన్ని ప్రయత్నించాలని ఆశపడుతున్నారు. మంచుతో నిండిన నీటిలో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. అయితే ఈ వాదనలకు బంధించిన కొన్ని పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఐస్ బాత్ చేస్తున్న సెలబ్రిటీలు : TOI నివేదిక ప్రకారం కిమ్ కర్దాషియాన్, కేట్ మిడిల్టన్, హ్యారీ స్టైల్స్ నుండి విరాట్ కోహ్లీ, రకుల్‌ప్రీత్ సింగ్, విద్యుత్ జమ్‌వాల్ వంటి ప్రముఖులు మంచునీటితో స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గి శరీరానికి మంచి అనుభూతి కలుగుతుందని వారు చెబుతున్నారు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఫిట్‌గా ఉండేందుకు ఇలాంటి సాహస చర్యలు తీసుకోగలరు.

ఐస్ బాత్ అంటే ఏమిటి ?

ఐస్ బాత్‌ని చల్లని నీటి ఇమ్మర్షన్ లేదా క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇందులో ఒక వ్యక్తి 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ (50 నుండి 59 డిగ్రీల ఫారెన్‌హీట్) చల్లటి నీటిలో సుమారు 11 నుండి 15 నిమిషాల పాటు స్నానం చేయాలి. ఇంతకుముందు వర్కవుట్ తర్వాత కోలుకోవడానికి ఆటగాళ్లు మాత్రమే ఈ థెరపీని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు దాని ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత సాధారణ ప్రజలలో కూడా ట్రెండ్‌గా మారింది.

మనస్సు హాయిగా ఉంటుంది..

చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల విశ్రాంతి, ఒత్తిడిని నియంత్రించే నాడీ వ్యవస్థ భాగాన్ని సక్రియం చేస్తుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మెదడు ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. సైన్స్ డైరెక్ట్ (రిఫరెన్స్) పై నివేదిక ప్రకారం ఇది అభిజ్ఞా పనితీరును పెంచుతుందట.

బరువు తగ్గడానికి..

ఐస్ బాత్ చేయడం ద్వారా శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా జీవక్రియ రేటును పెంచుతుందట.

రక్త ప్రసరణకు శ్రేష్ఠమైనది..

ఐస్ బాత్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. దీనితో శరీరం పోషకాలు, ఆక్సిజన్‌ను మంచి మార్గంలో ఉపయోగించుకోగలుగుతుంది. దీర్ఘకాలంలో, ఇది అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కండరాల రికవరీ వేగవంతం..

వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని ఐస్ బాత్ తగ్గిస్తుంది. కండరాలను వేగంగా రిలాక్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఐస్ బాత్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చల్లటి నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం, నరాలలో సున్నితత్వం ఏర్పడుతుంది. హైపోథర్మియా, గుండె సంబంధిత సమస్యలు కూడా సంభవించవచ్చు. అందుకే నిపుణుల సలహా మేరకు మాత్రమే ఐస్ బాత్ చేయాలట. 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు చల్లటి నీటిలో ఉండకూడదని నిపుణుల అభిప్రాయం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story