రోడ్‌ సైడ్ స్నాక్స్ తినకుండా ఉండలేకపోతున్నారా..? ఈ వీడియో చూస్తే ఇంకెప్పటికీ..

by Javid Pasha |   ( Updated:2024-09-09 10:48:34.0  )
రోడ్‌ సైడ్ స్నాక్స్ తినకుండా ఉండలేకపోతున్నారా..? ఈ వీడియో చూస్తే ఇంకెప్పటికీ..
X

దిశ, ఫీచర్స్ : స్నాక్స్ అంటే అందరికీ ఇష్టమే.. ముఖ్యంగా యూత్ అయితే పానీపూరీ సహా మెమోస్, కట్లెట్, బేల్ పూరి, మిర్చీ బజ్జీ, దహీవడ వంటి రోడ్‌సైడ్ తినుబండారాలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. అలాంటి ఫాస్ట్ ఫుడ్ రెసీపీల్లో మోమోస్ ఒకటి. చూడ్డానికి సాఫ్ట్‌గా, లోపల స్టఫింగ్‌తో చైనీస్ అండ్ ఇండియన్ రుచులతో కూడా ఇవి దొరకుతాయి. అయితే ఓ చోట మోమోస్ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు వామ్మా.. ఇలా కూడా చేస్తారా? అంటూ తెగ ఆశ్చర్య పోతున్నారు. ఏం జరిగిందంటే..

వైరలవుతోన్న వీడియో ప్రకారం అది మధ్యప్రదేశ్‌లో‌ని ఒక ప్రాంతం అని తెలుస్తోంది. కాగా ఇందులో ఓ వ్యక్తి మోమోస్ తయారు చేయాల్సిన మైదా పిండిని కాళ్లతో తొక్కుతున్నాడు. కాళ్లకు, చేతులకు కూడా ఎలాంటి సేఫ్టీ కవర్లు లేవు. ఒక బనియన్, కట్ డ్రాయర్‌పై ఉన్న ఆ వ్యక్తి ఎంతో ఇష్టంగా తినాల్సిన మోమోస్‌ను ఇలా తొక్కుతుండటం చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. పైగా ఆ ప్రదేశం కూడా అపరిశుభ్రంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చూసిన వారంతా వామ్మో ఈ వీడియో చూస్తే.. ఇక జన్మలో రోడ్ సైడ్ స్నాక్స్ గానీ, మోమోస్ గానీ తినలేమంటూ రియాక్ట్ అవుతున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇంత ఘోరంగా తయారు చేసే సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కొందరు కోరుతుండగా.. అందుకే బయటి ఫుడ్ తినేముందు ఒకసారి ఆలోచించాలని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. Roadside Meals

Advertisement

Next Story