- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జ్వరంతో బాధపడుతున్న వారు బనానా తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దిశ, ఫీచర్స్: వాతావరణంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. కేవలం ఫీవర్ మాత్రమే కాకుండా పలు రకాల జబ్బులతో సఫర్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం జీవన శైలిలో మార్పులనే చెప్పుకోవచ్చు. అయితే ఫీవర్ వచ్చినప్పుడు జ్వరం కారణంగా ఇష్టమైన ఫుడ్ తీసుకున్న రుచి అంతగా తెలియకుండా ఉంటుంది. కాగా కొంతమంది ఈ టైంలో బనానా తినొచ్చా? లేదా? అనే సందేహాంలో ఉంటారు. అయితే తాజాగా ఆరోగ్య నిపుణులు ఫీవర్ సమయంలో అరటిపండు తినవచ్చా? లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు.
ఫీవర్‌తో బాధపడుతోన్న వారు కచ్చితంగా బానానాను తినొచ్చని తేల్చి చెప్పారు ఆరోగ్య నిపుణులు. ఎలాంటి అపోహా లేకుండా అరటి పండ్లు తినండని చెబుతున్నారు. అరటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. బనానా తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ మెరుగుపడుతుంది. దీంతో జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు సమస్యతో బాధపడుతున్నవారు కూడా కొంతమంది అరటిపండు తినొచ్చా? అనే అపోహలో ఉంటారు. వారికి నిపుణులు ఏం చెబుతున్నారంటే? బనానా లో అధికంగా శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కోల్డ్ ఉన్నప్పుడు అస్సలు అరటి పండ్లు తినకూడదని, ఒకవేళ తింటే మరిన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.