- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి కాకుండా ప్రసూతి సెలవులు పొందవచ్చా?
దిశ, ఫీచర్: ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఎంతో అపురూపమైన గొప్ప వరం. పెళ్లి అయ్యాక చాలా మంది మహిళలు పిల్లలను కనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే వర్కింగ్ ఉమెన్స్ ప్రెగ్నెన్సీకి కాస్త టైమ్ తీసుకుని, తర్వాత ప్లాన్ చేసుకుంటారు. ఇక వారు గర్భధారణ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకోవడం చాలా కామన్. గర్భధారణ సమయంలో ప్రతి మహిళ ప్రసూతి సెలవులు తీసుకుంటుంది.
అయితే ఒకప్పుడు పెళ్లైతేనే, మహిళలు గర్భం ధరించేవారు. కానీ ప్రస్తుతం సరోగసి లాంటివి వచ్చాయి. దీని వలన మహిళలు పెళ్లి కాకుండానే గర్భం ధరిస్తున్నారు. కాగా, పెళ్లి కాకుండా గర్భం ధరించే వారికి ప్రసూతి సెలవులు లభిస్తాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.
విషయంలోకి వెళితే.. కార్మిక చట్టం ప్రకారం గర్భిణీలు 25 వారాలపాటు ప్రసూతి సెలవులు పొందడానికి అవకాశం కల్పించింది. అయితే ప్రసూతి సెలవులు పొందడానికి ముందుగా ఆ మహిళ 12 నెలల్లో ఉద్యోగి తప్పనిసరిగా 80 రోజులు పని చేసి ఉండాలి. అప్పుడే మీకు ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇక ఈ సెలవుల సమయంలో మహిళకు కంపెనీ పూర్తి జీతం చెల్లిస్తుంది. అయితే అవివాహిత స్త్రీలకు ప్రసూతి సెలవులు ఉంటాయా అంటే? భారత ప్రభుత్వ కార్మిక చట్టం ప్రకారం, పెళ్లికాని మహిళలు కూడా ప్రసూతి సెలవులు పొందవచ్చునంట. అలాగే బిడ్డను దత్తత తీసుకున్న మహిళలు కూడా ప్రసూతి సెలవులు తీసుకునే హక్కు పొందవచ్చునంట. ఎందుకంటే ఈ చట్టం గర్భం లేదా పిల్లల సంరక్షణ కోసం మాత్రమే చేయబడుతుంది.