Shivratri : శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

by Javid Pasha |
Shivratri : శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : త్వరలో శివరాత్రి రాబోతోంది. ఆ తర్వాత రంజాన్ మాసం కూడా ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే హెల్త్ పరంగా చూసినప్పుడు ఉపవాసం ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు? షుగర్ పేషెంట్లు కూడా ఉండొచ్చా? అనే సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

* ఆకలితో ఉండటం, చాలా కాలం తినకపోవడం వేరు, అప్పుడప్పుడూ లేదా కొన్ని రోజులు ఉపవాసం ఉండటం వేరని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి శివరాత్రి, రంజాన్ వంటి సమయాల్లో ఉపవాసం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉపవాసానికి ప్రారంభంలో, వదిలే సమయంలో తగిన పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటారు. కాబట్టి దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

*ఉపవాసం ఉండే సమయంలో శరీరంలోని కొవ్వు కరిగి గ్లూకోజ్‌గా మారుతుందని, దీనివల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. శరీరంలోని కణాల డ్యామేజ్‌ను రిపేర్ చేయడంలోనూ ఉపవాసం పరోక్షంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి టైఫ్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి అదుపులో ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా స్థిరంగా ఉండి కిటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఫెస్టివల్ సమయాల్లో ఒక రోజు లేదా కొద్ది రోజులు ఉండే ఉపవాసం వల్ల నష్టం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఉపవాసం ఉండటంవల్ల నష్టం లేదు. అయితీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే డాక్టర్ల సలహాలు పాటించండం బెటర్. ఉపవవాసం ఉన్నవాళ్లు ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. దీంతో జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. అట్లనే తులసీ ఆకులతో టీ, బ్లాక్ కాఫీ వంటివి కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే షుగర్ పేషెంట్లు వేయించిన ఆహారాలు తీసుకోవద్దు. దీనివల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

*ఉపవాసం ఉన్నప్పటికీ ఫుడ్ తీసుకునే సమయంలో తగిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ తప్పక ఉండాలి. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు శాఖాహారమే తీసుకుంటారు. కాబట్టి తగిన పోషకాలు ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. అందుకోసం పండ్లు, గింజలు, పప్పులు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇక రంజాన్ సమయంలో ఉపవాసం ఉండేవారు శాఖాహారంతోపాటు మాంసాహారం కూడా తీసుకుంటారు కాబట్టి ఈ సమయంలో లీన్ మీట్స్, చేపలు, గుడ్లు, ఇతర మాంసాహారం వంటివి ఉపవాసం వదిలాక, ఉపవాసానికి ప్రారంభంలో తినవచ్చు. ఇలా చేయడంవల్ల షుగర్ పేషెంట్లు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

*అట్లనే ఉపవాస సమయంలో శరీరంలో జరిగే మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. కొందరు తినకుండా ఉంటే కళ్లు తిరగడం, తలనొప్పి రావడం వంటివి సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. అలాగే సరిపడా నిద్ర, తేలికపాటి వ్యాయామాలు ఉపవాస సమయంలో కూడా అవసరమే. వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ వంటివి చేయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed