Broomstick : ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న చీపుర్లు.. అసలు కథ తెలిస్తే.. కాదా మరి అంటారు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-23 16:53:51.0  )
Broomstick : ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న చీపుర్లు.. అసలు కథ తెలిస్తే.. కాదా మరి అంటారు..
X

దిశ, ఫీచర్స్: ఇంటిని పూర్తిగా క్లీన్ చేసి శుభ్రంగా ఉంచే చీపురుకు అంత ప్రాధాన్యత ఇవ్వం. పైగా ఓ మూలన పడేసి చేతులు దులుపుకుంటం. అయితే ఇదే చీపురు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. నార్మల్ గా ఫుడ్ ప్రొడక్ట్స్ పై లేబుల్ చేసే పోషకాల విలువను.. దీని ప్యాకేజింగ్ కవర్ పై ప్లేస్ చేయడమే ఇందుకు కారణం. కేలరీల నుంచి డైటరీ ఫైబర్ వరకు.. మొక్కజొన్న, కనోలా నూనె, ఉప్పు, సున్నం ట్రేస్‌ను కలిగి ఉందని ఈ పదార్థాలను కూడా లిస్ట్ చేసింది. ఓ రెడిట్ యూజర్ దీన్ని నెట్టింట ముందుగా షేర్ చేయగా.. ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.

కాగా దీనిపై స్పందించిన నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి. ' వెయిట్ లాస్ కు బెస్ట్ డైట్ ', ' ఒక్కసారి చీపురుతో ఊడిస్తే 150 కేలరీలు బర్న్ అవొచ్చు ', ' అమ్మ చిన్నప్పుడు చీపురు దెబ్బలు ఎందుకు కొట్టేదో ఇప్పుడు అర్థం అవుతుంది ', ' చదివినా కొద్ది మరింత ఫన్ జనరేట్ అవుతుంది ' అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story