Broccoli.. ఏలియన్స్ ట్రాకర్

by Hamsa |   ( Updated:2022-11-29 14:17:52.0  )
Broccoli.. ఏలియన్స్ ట్రాకర్
X

దిశ, ఫీచర్స్: గ్రహాంతర జీవుల జాడలు కనుగొనేందుకు శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వాటితో కమ్యూనికేట్ అయ్యేందుకు అనేక టెక్నాలజీలను రూపొందిస్తున్నారు. కానీ ఏ ఒక్కటి ఫలించలేదు. కానీ 'బ్రోకలి' మొక్క నుంచి వెలువడే వాయువుతో ఏలియన్స్ ఉనికిని కనుగొనే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు.

బ్రోకలి, ఆల్గేతో సహా భూమిపై ఉన్న కొన్ని మొక్కలు వాయువులుగా మార్చడం ద్వారా వాటిపై ఉండే విషాన్ని తొలగించుకుంటాయి. ఈ ప్రక్రియను మిథైలేషన్‌ అని పిలుస్తుండగా.. పురాతన లెజెండరీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని పరికరాలను ఉపయోగించి అటువంటి వాయువుల ఉనికిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌కు చెందిన ప్లానెట్ సైంటిస్ట్ మైఖేలా లెంగ్ చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. జీవి కానిది ఏదైనా ఈ వాయువులను విడుదల చేయడం చాలా అసంభవం అని పేర్కొన్నారు.

'భూమిపై మిథైలేషన్ ప్రక్రియ విస్తృతంగా ఉంది. కాబట్టి జీవి ఎక్కడైనా దానిని అమలు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇందులో చాలా కణాలకు హానికరమైన పదార్థాలను బహిష్కరించే యంత్రాంగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాయువును నాన్-బయోలాజికల్ మార్గాల ద్వారా సృష్టించడానికి పరిమిత మార్గాలు ఉన్నాయి. అందువల్ల ఇది జీవానికి మరో సూచిక అని తెలిపారు. అయితే అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి అటువంటి వాయువులను బహిష్కరించబడటానికి ఒక చిన్న అవకాశం ఉంది. కానీ జీవులు మిథైలేటెడ్(విషపూరితమైన, ఎక్కువగా మండే, రంగులేని వాయువు. రక్తం, మెదడు, ఇతర జంతువులు, మొక్కల కణజాలాలలో సహజంగా సంభవిస్తుంది. నోటి దుర్వాసన, అపానవాయువు వాసన కలిగించే ప్రధాన రసాయనాలలో ఇది ఒకటి) వాయువులను ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో.. ఈ వాయువులు మిడ్-ఇన్‌ఫ్రారెడ్‌(శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉపయోగించబడిన ఒక విశ్లేషణాత్మక సాంకేతికత)లో కనిపిస్తాయి. దీంతో ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సిద్ధాంతపరంగా.. వాతావరణంలో తేలుతున్న గ్యాస్ కణాలను కనుగొనవచ్చు.

అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి శక్తివంతమైన సాధనం (NIRSpec పరికరం వంటిది)మిథైలేటెడ్ వాయువుల జాడలను కనుగొనడానికి ఒక ఎక్సోప్లానెట్ సమీపంలోకి వందకు పైగా ప్రయాణాలను చేస్తుంది. దీంతో గ్రహంపై జాడలేని జీవిని చేధిస్తే.. ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనలలో ప్రశ్నగా మిగిలిన శాస్త్రవేత్తల శ్రమకు ఇదొక సమాధానంగా ఉంటుంది.

READ MORE

అంకితం, ఆవిష్కరణ.. జీవితాంతం పరిశోధనలపైనే అమర్ బోస్ దృష్టి

Advertisement

Next Story