సిబ్బందికి బ్రిటన్ ప్రధాని సంక్రాంతి విందు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-01-23 06:05:36.0  )
సిబ్బందికి బ్రిటన్ ప్రధాని సంక్రాంతి విందు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత సంతతికి చెందిన బ్రిట‌న్ ప్రధాన మంత్రి రిషిసునాక్ విదేశాల్లో స్థిరపడినా భారతదేశ సాంప్రదాయాలు, కట్టుబాట్లను పాటిస్తూనే ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా రిషి సునాక్ తన బ్రిటన్ కార్యాలయ సిబ్బందికి విందును ఏర్పాటు చేశారు. లండన్‌లోని 10 డైనింగ్ స్ట్రీట్‌లో కార్యాల‌య సిబ్బందికి సంప్రదాయ రుచుల‌తో సంక్రాంతి విందును ఏర్పాటు చేసిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. భారత సంతతికి చెందిన రిషిసునాక్, దేశ కట్టుబాట్లను పాటిస్తూ పొంగల్ వేళ రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వాటిని అరిటాకుల్లో వ‌డ్డించిన వీడియోలు అచ్చం దేశ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తున్నాయి. రిషీ సునాక్ ఏర్పాటు చేసిన పొంగ‌ల్ లంచ్‌ను కార్యాల‌య సిబ్బంది ఆస్వాదించారు. అర‌టాకుల్లో ఆహార ప‌దార్ధాల‌ను సంప్రదాయ దుస్తుల‌ను ధ‌రించిన వ్యక్తులు స‌ర్వ్ చేశారు. కాగా, ఈ వారం అంతటా సంక్రాంతిని జ‌రుపుకుంటున్న వారంద‌రికీ శుభాకాంక్షలు తెలియ‌చేస్తున్నాన‌ని.. ఈ ప‌ర్వదినాన ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని రిషీ సునాక్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : భారత్‌తో యుద్దం గురించి పాక్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story