బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

by sudharani |
బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
X

దిశ, ఫీచర్: రోజూ ఓ గంట పాటు బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కానీ వాకింగ్‌వల్ల పెద్ద ప్రయోజనం లేదంటూ కొందరు మధ్యలోనే మానేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి ఫలితం కనిపించకపోవడానికి, వాకింగ్‌ ఉపయోగకం కాకపోవడం కాదని, బరువు తగ్గడానికి సహకరించే ఆహారం విషయంలో నిర్లక్ష్యమే అందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల వాకింగ్, రన్నింగ్ చేసేవారు కొన్ని నియమాలు విధిగా పాటించాలని సూచిస్తున్నారు.

గుడ్ కొలెస్ట్రాల్ అవసరం

బరువు తగ్గాలనుకునే వారిలో చాలా మంది కొవ్వు పదార్థాలు తినడం పూర్తిగా మానేస్తుంటారు. దీంతో శరీరానికి అవసరమైన గుడ్ కొలెస్ర్టాల్ కూడా అందకుండా పోతుంది. కొందరైతే ఒమేగా-3 కలిగిన పప్పు ధాన్యాలు, అవొకాడోలను కూడా తినకుండా దూరం పెడుతుంటారు. నిజానికి, కొబ్బరి, ఆలివ్‌ నూనెలు క్యాలరీలను ఖర్చుచేసే ఇంధనంగా ఉపయోగపడతాయి. అందుకే గుడ్ కొలెస్ర్టాల్ ఉండే అవొకాడో భోజనానికీ, భోజనానికి మధ్య స్నాక్స్‌లా తీసుకోవాలి. దీనివల్ల జీవక్రియలు సక్రమంగా పనిచేసి వాకింగ్‌ తాలూకు ఫలితాలు శరీరంలో కనిపిస్తాయి.

భోజనం మానుకోవద్దు

చాలా త్వరగా బరువు తగ్గాలనుకునే వారు భోజనం మానేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌నో, లంచ్‌నో మానేయడం వల్ల జీవక్రియలు కుంటుపడతాయి. శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రకియ ఆగిపోతుంది. ఫలితంగా కొవ్వు పదార్థాలు శరీరంలో నిలిచిపోతాయి. అందువల్ల భోజనం మానేయడం కరెక్టు కాదు, కాకపోతే మధ్య మధ్యలో ఉపవాసాలు వంటివి చేయవచ్చు. నిజానికి బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారు స్వల్ప మోతాదులోనే రోజుకూ ఆరు దఫాలుగా ఆహారాన్ని తీసుకోవడం అవసరం.

మార్కెట్ ఫుడ్ వద్దు

పలురకాల పోషకాల మిశ్రమంగా మార్కెట్‌లో లభించే గ్రనోలా లాంటివి కొందరు తరచూ తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో షుగర్‌ స్థాయిలు అధికంగా ఉండడంవల్ల విపరీతంగా ఆహారం తీసుకునే లక్షణం పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అందుకే ప్రీ ప్యాకేజ్డ్ స్నాక్స్‌ కాకుండా తాజా ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి నిదానంగా జీర్ణం కావడంవల్ల మళ్లీ మళ్లీ తినేలా ఆకలి వేయదు. అందుకే పిడికెడు వాల్నట్స్‌, బాదం, లేదా ఏవైనా పండ్లు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది.

Advertisement

Next Story