పెళ్లి వేడుకలో రివాల్వర్‌తో వధువు కాల్పులు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-04-12 07:56:31.0  )
పెళ్లి వేడుకలో రివాల్వర్‌తో వధువు కాల్పులు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కలకలం రేపింది. సేలంపూర్‌లో శుక్రవారం ఓ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. వేదికపై వధువు, వరుడు కూర్చుని అతిధుల ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇంతవరకు ఎక్కడైనా జరిగేదే. ఐతే ఈ పెళ్లిలో మాత్రం వేదికపై వరుడి పక్కన కూర్చున్న వధువుకి రివాల్వర్‌ను ఫుల్‌గా లోడ్‌ చేసి ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత వధువు రివాల్వర్‌ను ఎత్తిపట్టి గాల్లో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. పాపం పక్కనే ఉన్న వరుడు మాత్రం బిక్కసచ్చినట్లు ఉలుకూపలుకూ లేకుండా మౌనంగా కూర్చుని ఉన్నాడు.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవడంతో అదికాస్తా పోలీసుల కంట పడింది. అంతే సదరు వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నవ వధువు, ఆమెకు తుపాకీ అందించిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఎవరైనా మానవ ప్రాణాలకు లేదా ఇతరుల భద్రతకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా తుపాకీని వినియోగిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటిని కూడా శిక్షగా విధించే అవకాశం ఉంది. హత్రాస్‌లోని సేలంపూర్ ప్రాంతంలోని అతిథి గృహంలో వివాహ సంబరాల్లో భాగంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Also Read..

పౌర్ణమి సమయంలో ఆత్మహత్యల పెరుగుదల.. కారణమిదే..!!

Advertisement

Next Story