బ్రెస్ట్‌ మసాజ్.. వేళ్లతో సున్నితంగా ప్రెస్ చేయడం ద్వారా..

by Prasanna |   ( Updated:2023-06-10 10:21:01.0  )
బ్రెస్ట్‌ మసాజ్.. వేళ్లతో సున్నితంగా ప్రెస్ చేయడం ద్వారా..
X

దిశ, ఫీచర్స్: మనం స్పాకు వెళ్లినప్పుడు లేదా హోమ్ మసాజ్ సర్వీసులకు వెళ్లినప్పుడు.. షోల్డర్స్, హ్యాండ్స్, లెగ్స్, బ్యాక్‌పైనే దృష్టి పెడతాం. కానీ బ్రెస్ట్ మసాజ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కొందరు తాము సున్నితంగా ఉంటామని, మసాజ్ తల్లి పాలను ప్రభావితం చేస్తుందని భావిస్తారు కానీ దీని వల్ల అనేక ప్రయోజనాలున్నాయని.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఒక మార్గంగా చూడాలని అంటున్నారు.

బ్రెస్ట్ మసాజ్ ప్రయోజనాలు

1. బ్రెస్ట్ మసాజ్ రక్త ప్రవాహాన్ని, శోషరస పారుదలని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రొమ్ము సున్నితత్వం, నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి విశ్రాంతినిస్తుంది.

2. కొంతమంది మహిళల్లో రొమ్ము మసాజ్ తర్వాత కుంగిపోయిన వక్షోజాలు మెరుగ్గా కనిపిస్తాయి. మసాజ్ చేసేటప్పుడు బ్రెస్ట్ టైట్ కావడానికి, చర్మ దృఢత్వాన్ని మెరుగుపరచడానికి, ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అయ్యేందుకు ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు.

3. బ్రెస్ట్ మసాజ్ పాలిచ్చే తల్లులకు గొప్పగా వర్క్ చేస్తుంది. పాల ప్రవాహాన్ని మెరుగుపరచడంతోపాటు రొమ్ముల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బిడ్డ పుట్టిన ఏడాదిలోపు మసాజ్ చేస్తే.. తల్లి పాల నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు తక్కువ బ్రెస్ట్ పెయిన్ అనుభవిస్తారు.

ఎలా చేయాలి?

• ముందుగా వృత్తాకార కదలికలతో వక్షోజాన్ని వేడెక్కించడం ద్వారా ప్రారంభించాలి.

• అరచేతులతో బ్రెస్ట్‌పై మృదువుగా ప్రెస్ చేయండి. ఈ విధంగా బయట నుంచి ప్రారంభించి మధ్యలోకి వెళ్తూ ఉండండి.

• అరోలా, నిపుల్‌తో సహా రొమ్ము చుట్టూ వృత్తాకార కదలికలు చేయడానికి వేళ్లను ఉపయోగించండి.

• రొమ్ము కణజాలానికి మసాజ్ చేయడానికి గట్టి స్పర్శను ఉపయోగించండి. కానీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించండి.

• ఏదైనా ద్రవం లేదా గడ్డలను నిపుల్ వైపు, రొమ్ము కణజాలం నుంచి బయటకు తరలించడానికి సున్నితమైన స్క్వీజింగ్ మోషన్‌ను ఉపయోగించండి.

ఎవరు దూరంగా ఉండాలి?

* రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న మహిళలు బ్రెస్ట్ మసాజ్ ట్రై చేసే ముందు వైద్యుడితో మాట్లాడటం మంచిది.

* ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ లేదా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వంటి కొన్ని రొమ్ము పరిస్థితులు ఉన్న మహిళలు కూడా రొమ్ము మసాజ్‌ను నివారించాలి లేదా ప్రయత్నించే ముందు డాక్టర్ సూచన తీసుకోవాలి.

* గర్భవతిగా ఉన్న లేదా బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి.

* మసాజ్ సమయంలో లేదా తర్వాత ఏదైనా నొప్పి, అసౌకర్యం లేదా అసాధారణమైన మార్పులను అనుభవిస్తే.. వెంటనే ఆపి, వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: ఏడుపు రోగం కాదు...భోగం

కుక్క కాలు ఎత్తి మూత్రం పోయడం వెనుక అసలు కారణం అదేనట..

Advertisement

Next Story