షాకింగ్ న్యూస్.. పురుషుల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

by Jakkula Samataha |   ( Updated:2024-03-19 07:37:47.0  )
షాకింగ్ న్యూస్.. పురుషుల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది మహిళలే. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అనుకుంటారు కానీ,ఇది మహిళలకే కాదు, పురుషులకు కూడా వస్తుందంట. అయితే పురుషులలో రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు, ఎరుపు రంగులో నిపుల్స్ లేదా చనుమొన నుంచి ద్రవం బయటకు వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లే అంటున్నారు నిపుణులు.

అయితే రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫామ్ చేసుకోవడానికి బీఆర్‌సీఏ టెస్ట్ చేయించుకోవాలంట. ఇది జన్యు పరీక్ష. పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఆ వ్యక్తికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినట్లు. ఇక ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదు, సరైన చికిత్స తీసుకుంటే సకాలంలో కోలుకోవచ్చు. ఇక పురుషులలో రొమ్మ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఒక శాతం పురుషులు మాత్రమే ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Read More..

ఆ అలవాటు ఉన్నవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది?

Advertisement

Next Story

Most Viewed