తామే గొప్ప అనుకొని నష్టపోతున్న అబ్బాయిలు.. సమానం అనుకుంటేనే సమస్యలు దూరం!

by Anjali |
తామే గొప్ప అనుకొని నష్టపోతున్న అబ్బాయిలు.. సమానం అనుకుంటేనే సమస్యలు దూరం!
X

దిశ, ఫీచర్స్: పురుషాధిక్య భావజాలం, మహిళలపట్ల చులకన భావం వల్ల సాధారణంగా మహిళలకు లేదా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని అనుకుంటాం. కానీ దీనివల్ల పురుషులు కూడా నష్టపోతారని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అమ్మాయిలు ఉన్నంత స్వేచ్ఛగా ఉంటారు. అబ్బాయిలు ఉండలేరు. ముఖ్యంగా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే విషయంలో అబ్బాయిలు నష్టపోతుంటారు. ‘గట్టిగా ఏడవడం, ఇష్టమైన వారిపై ప్రేమను వ్యక్తపరచకపోవడం, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండటం, పలు విషయాల్లో మానసికంగా కృంగిపోవడం లాంటి సమస్యలను మేనేజ్ చేయడంలో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారట. అవేంటో చూద్దాం.

* మోయలేని కష్టం..

ఎవరైన సరే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎప్పుడైన భర్తే గొప్ప అంటారు. అది అపనమ్మకమంటున్నారు నిపుణులు. అందరూ సమానమే అనుకుంటూనే ఏ బంధం అయినా కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు. కొంతమంది భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక భార్యపై పని భారం తగ్గించడానికి ఇంట్లోనే ఉంచుతారు. కానీ కేవలం భర్త సంపాదన మీదనే ఇల్లు గడవాలనే రూల్ సరైంది కాదని, భార్యభర్తలు సమానమే అనుకుని పని చేయాలని సూచిస్తున్నారు. కష్టంలో, సుఖంలో పాలుపంచుకుంటూనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండగలుగుతారని చెబుతున్నారు.

* నిశ్శబ్ద పోరాటం...

ఒక ఇంట్లో ఏదైనా అవసరమున్నా, కష్టమొచ్చినా, హ్యాపీనెస్ వొచ్చినా, సమస్యలు తీర్చాలన్నా, డబ్బు కావాలన్న మగవాళ్ల దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి అబ్బాయిలు ఏదైనా కష్టం వచ్చిన, మనీ అవసరమున్నా బయటవాళ్ల సాయం, అమ్మాయిలను హెల్స్ చేయమని అడగడం అస్సలు చేయరు. దీంతో తమలో తామే ఒత్తిడికి గురవుతారు. ఆందోళన చెందుతారు. ఈ సమస్యల కారణంగా దేశంలో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి.

* ఏదైనా రిస్క్ చేయాలి..

అబ్బాయిలు అర్థరాత్రి అయినా సరే తమ కుటుంబానికి గానీ, పక్కింటివారికి గానీ ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే ముందుండి రిస్క్ చేస్తారు. సహాయం చేయబోయి కొన్నిసార్లు ప్రమాదంలో పడతారు కూడా. తమతో పాటు కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేస్తారు. కాగా అబ్బాయి కదా భయపడతారా అలా భయపడతారా? అంటూ హేళన చేయొద్దు. అబ్బాయైనా? అమ్మాయైన సామర్థ్యాన్ని మించి భారాన్ని మోయలేరని అర్థం చేసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు

* భావోద్వేగాలను నియంత్రించుకోవడం..

దాదాపు 99 శాతం మగాళ్లు దు:ఖం వస్తే బయటకు చెప్పుకోరు. మనస్ఫూర్తిగా ఏడవలేరు కూడా. మగవాళ్లంటే అందరిముందు డేర్‌గా ఉండాలన్నా ఓ ఆలోచనతో మనసులో ఎంత బాధున్నా అందరిముందు గంభీర్యంగానే ఉండాలనుకుంటారు. దీంతో వారిలో వారే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఒక పని చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. కానీ ఇలాంటి సమస్యల వల్ల ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story