బొటాక్స్‌తో బ్రెయిన్‌‌పై ఎఫెక్ట్.. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గుర్తించలేని పరిస్థితి..

by Hamsa |   ( Updated:2023-03-24 13:37:37.0  )
బొటాక్స్‌తో బ్రెయిన్‌‌పై ఎఫెక్ట్.. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గుర్తించలేని పరిస్థితి..
X

దిశ, ఫీచర్స్: ఫేషియల్ ఫీడ్‌బ్యాక్ హైపోథెసిస్ ప్రకారం ఎదుటి వ్యక్తి ముఖంపై కోపం లేదా సంతోషాన్ని చూసినప్పుడు.. వెంటనే మన ఫేస్‌లోనే అదే రియాక్షన్ ఉంటుంది. వారిని అనుకరించడానికి మన ముఖంలోని కండరాలను వంచుతాము లేదా కుదించుకుంటాము. ఇది అపస్మారక ప్రక్రియ. మన ముఖ కండరాలు మరొక వ్యక్తి చిరునవ్వును అనుకరిస్తున్నందున, వాటిని అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి సంకేతాలు మెదడుకు పంపబడతాయి. ఇది ఇతర వ్యక్తుల భావోద్వేగ స్థితులను గుర్తించే మన సామర్థ్యానికి మాత్రమే కాకుండా, వాటిని మనమే అనుభవించడానికి కూడా సహాయపడుతుందని భావిస్తారు శాస్త్రవేత్తలు. అంటే ఫేషియల్ ఫీడ్‌బ్యాక్ హైపోథెసిస్.. ముఖంలోని కండరాల జ్ఞాపకశక్తికి, మెదడులోని భావోద్వేగాల ప్రక్రియకు మధ్య సంబంధం ఉందని సూచిస్తుంది.

అయితే ఈ బంధం నుదుటికి బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా మందగించిందని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ పరిశోధకుల బృందం తెలిపింది. 33 నుంచి 40ఏళ్ల వయసు గల పది మంది మహిళలపై జరిపిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత.. కండరము (ఇది ముఖం చిట్లించటానికి బాధ్యత వహిస్తుంది), భావోద్వేగ ముఖాల చిత్రాలను గమనించారు సైంటిస్టులు. నుదిటిపై బొటాక్స్ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత, ఎమోషన్స్ చూపించే ఎమోజీస్ చూసినప్పుడు వ్యక్తుల మెదళ్ళు వేరే విధంగా స్పందించాయని తెలిపారు. వారి ముఖ కండరాలు, మెదడుకు మధ్య అంతరాయం కలిగించే సిగ్నలింగ్ కారణంగా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కష్టమని గుర్తించారు. ఎమోషనల్ ప్రాసెసింగ్‌కు బాధ్యత వహించే మెదడు కేంద్రమైన అమిగ్డాలాలోని కార్యకలాపాల్లో మార్పును గమనించినట్లు చెప్పారు.

Also Read..

అలర్ట్ : గర్భ నిరోధక మాత్రలు వాడితే ముప్పు తప్పదు

Advertisement

Next Story

Most Viewed