2.0 కంటే దిగువకు పడిపోయిన సంతానోత్పత్తి రేటు

by srinivas |
2.0 కంటే దిగువకు పడిపోయిన సంతానోత్పత్తి రేటు
X

దిశ, ఫీచర్స్ : గౌడియం IVF.. అత్యంత అధునాతన పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందిన ఫెర్టిలిటీ ట్రీట్మెంట్‌ క్లినిక్స్‌లో ఒకటి. భారతదేశంలో 40% మంది పురుషులు, 40% మహిళలతో పాటు 20% వరకు ఇద్దరూ కలిసి వంధ్యత్వానికి కారణమవుతున్నారని నిర్ధారించడంలో ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ప్రకారం జాతీయంగా భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) మొదటిసారిగా 2.0 కంటే దిగువకు పడిపోయింది.

ఇన్‌ఫెర్టిలిటీ ప్రమాదాన్ని పెంచే కారకాలు :

ఈ భయంకరమైన డేటాకు వంధ్యత్వం ప్రధాన కారణమని ఊహిస్తున్నారు. అన్ని లింగాలలో వంధ్యత్వానికి సంబంధించిన ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారకాలు.

* మానసిక స్థితి, ఒత్తిడి స్థాయిలను ప్రభావితం చేసే డిస్టర్బ్‌డ్ బయోలాజికల్ క్లాక్

* స్లీప్ అండ్ ఈటింగ్ డిజార్డర్స్

* మధుమేహం

* క్షయవ్యాధి

* వాయు కాలుష్యం, పర్యావరణ విషపదార్థాలకు ఎక్స్‌పోజ్ కావడం

* అధిక మద్యం, పొగాకు వినియోగం

* ఓవర్ ఎక్సర్‌సైజ్

గౌడియం IVF పరిశోధనలు.. ప్రతి జంట భిన్నంగా ఉంటుంది కాబట్టి ఫెర్టిలిటీకి కారకాలు, సక్సెస్, సంతానోత్పత్తి చికిత్స ప్రయాణం కూడా గణనీయంగా మారుతుందని నిర్ధారించింది. అంతేకాదు సామాజిక నిషేధాలు, అపోహలను చాలెంజింగ్‌గా స్వీకరించి ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స తీసుకోవాల్సిన అవసరముందని.. టైర్-2 & 3‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లోనూ ఈ విషయంలో సామాజిక అడ్డంకులు ఉన్నాయని పేర్కొంది. సంతానోత్పత్తి చికిత్సకు సంబంధించి పెరిగిన అవగాహన మూలంగా ప్రస్తుతం ఎక్కువ మంది వ్యక్తులు తమ సంతానోత్పత్తి సమస్యల గురించి ఓపెన్ కావడంలో.. IVF నిపుణుల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గుచూపుతున్నారు. నిదానంగా ఏర్పడిన ఈ విశ్వాసం భారతదేశంలో చాలా మంది జంటలను వేధిస్తున్న వంధ్యత్వ సమస్యలను అధిగమించడంలో సాయపడుతుందని ఈ పరిశోధన పేర్కొంది.

ఆందోళన కలిగించే అంశాలు :

పురుషుల్లో ఒత్తిడి స్థాయిలు పెరగడం వల్ల వంధ్యత్వం వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా మగాళ్ల వంధ్యత్వానికి సంబంధించిన అనేక కేసులు ఇందుకు సంబంధించినవే. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రబలంగా ఉన్న పొగాకు వాడకం కూడా ప్రధాన కారణమే. అయితే పట్టణ, మెట్రో నగరాల్లోని కార్పొరేట్ ఆఫీసుల్లో నైట్ షిఫ్టులు, టార్గెట్స్ చేరుకోవడంలో స్ట్రెస్ & డెడ్‌లైన్స్ కారణంగా సిర్కాడియన్ రిథమ్(శరీర జీవ గడియారం)కు అంతరాయం కలుగుతుంది. నిద్ర & మానసిక రుగ్మతలు తరచూ వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మహిళల్లో వేగంగా క్షీణిస్తున్న అండాశయ నిల్వలు పేలవమైన నాణ్యత, తక్కువ సంఖ్యలో ఎగ్స్ ఉండేందుకు దారితీస్తున్నాయి. క్షయవ్యాధి (TB), PCOD, హార్మోన్ల ఆటంకాలు, ఎండోమెట్రియోసిస్, ప్రిజర్వేటివ్స్‌ ఎక్కువగా తీసుకోవడం మొదలైనవి తక్షణ ఆందోళన కలిగించే అంశాలు.

20,000 మంది జంటల్లో వంధ్యత్వానికి చికిత్స చేసిన గౌడియం IVF వ్యవస్థాపకులు డాక్టర్ మణిక ఖన్నా.. భారత్‌లోనే కాక యూఎస్, యూరప్ నుంచి వచ్చిన రోగుల్లోనూ చాలా మందికి ప్రమాద కారకాల గురించి తగినంత అవగాహన లేకపోవడాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం కారణంగా అయోమయ స్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. అందువల్ల వారికి విశ్వసనీయ మూలాధారాలను మాత్రమే సూచించామని లేదా IVF నిపుణులను సంప్రదించడం ద్వారా తమకు తాము అవగాహన పెంచుకోవాలని సలహా ఇచ్చినట్లు చెప్పారు.

నిపుణులను సంప్రదించాలి..

గత దశాబ్దంలో వైద్య విజ్ఞాన రంగంలో గొప్ప పురోగతి సాధించాం. గుర్తించదగిన పరిశోధనలు జరిగాయి. అయితే పాశ్చాత్య జనాభాకు వర్తించేది భారత జాతికి బాగా పనిచేయకపోవచ్చు. మన శరీరం విషయంలో భౌగోళిక, వాతావరణానికి సంబంధించిన ప్రతిదీ లెక్కించబడుతుంది. కాబట్టి మీ జీవనశైలి రుగ్మతలను తిప్పికొట్టడానికి, వంధ్యత్వానికి చికిత్స చేయడానికి నిపుణులైన వైద్యులను సంప్రదించండి.

- డాక్టర్ మణిక ఖన్నా

Advertisement

Next Story

Most Viewed