DOG - KID BOND : ఏడుస్తున్న బుడ్డోడి కళ్లు తుడుస్తూ.. ముద్దాడుతూ.. సముదాయిస్తున్న బుజ్జి కుక్క పిల్ల(VIDEO)

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-23 10:01:21.0  )
DOG - KID BOND :  ఏడుస్తున్న బుడ్డోడి కళ్లు తుడుస్తూ.. ముద్దాడుతూ.. సముదాయిస్తున్న బుజ్జి కుక్క పిల్ల(VIDEO)
X

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి కుక్కలు సైకాలజీ చదివాయేమో అనిపిస్తుంది. ఈ నాలుగు కాళ్ల స్నేహితులు తమ రెండు కాళ్ల ఫ్రెండ్స్ బాధగా ఉంటే అస్సలు తట్టుకోలేవు. మనుషులు ఏడిస్తే అవి కూడా ఏడ్చినంత పని చేస్తాయి. సముదాయించేందుకు ప్రయత్నిస్తాయి. ఇలాంటి క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఓ బుడ్డి పిల్లోడు కన్నీరు కారుస్తూ సైలెంట్ గా ఏడుస్తున్నాడు. దీన్ని చూసిన అతని కన్నా చిన్నగా ఉన్న బుజ్జి కుక్క పిల్ల కళ్లు తుడుచుకోమని న్యాప్కిన్స్ అందిస్తుంది. అయినా కన్నీళ్లు ఆపకపోయే సరికి మరో న్యాప్కిన్ ఇచ్చి.. బుగ్గ మీద ముద్దులిస్తూ.. భుజం మీద తలపెట్టి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నెట్టింట లక్షకు పైగా వీక్షణలు సొంతం చేసుకోగా.. భారీ లైక్స్ వచ్చేశాయి.

ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు.. ఈ ఇద్దరి బాండ్ చూసి ఫిదా అయిపోయామని చెప్తున్నారు. మా హార్ట్ టచ్ చేసిన వీడియో ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు తమ పెట్ డాగ్ తో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఎప్పటికీ క్యూట్ గానే ఉంటాయని చెప్తున్నారు. నిజంగా కుక్కలు మనిషికి ఒత్తిడి నుంచి రిలాక్స్ చేస్తాయని.. ప్రేమను పంచుతాయని అంటున్నారు.

Advertisement

Next Story